దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ మరియు నటి పవిత్రా లోకేష్ మధ్య సంబంధం గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. వీరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకున్నారంటూ ఆ మధ్య కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో అనేక చిత్రాల్లో కలిసి నటించిన నరేష్ మరియు పవిత్రా లోకేష్.. ఇప్పటి వరకు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ తరచుగా కలుస్తుండటం.. ఎక్కడికెళ్లినా జంటగా వెళ్తుండటం.. నరేష్ మూడో భార్య లేవనెత్తిన వివాదం తర్వాత పరిస్థితులు వంటివి వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే వార్తలకు బలం చేకూర్చాయి.
అయితే నరేష్ - పవిత్రా వివాదం తర్వాత విడుదలైన సినిమాలలో వీరిద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. స్క్రీన్ పై కనిపించినప్పుడు జనాలు థియేటర్లో ఈలలు వేస్తూ గోల గోల చేస్తున్నారు. రీసెంట్ గా కమెడియన్ అలీ రూపొందించిన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' సినిమాలోనూ నరేష్ - పవిత్ర కలిసి కనిపించారు. ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదలైంది.
అయితే ఇప్పుడు నరేష్ మరియు పవిత్రలు తమ వ్యక్తిగత జీవితాల ఆధారంగా సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారని ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇద్దరి పర్సనల్ లైఫ్ లో ఇప్పటివరకు జరిగిన పరిస్థితులపై ఈ చిత్రం తెరకెక్కుతుందని.. ఇందులో వారిద్దరే ప్రధాన పాత్రలు పోషిస్తారట. తమ జీవితంపై సినిమా చేయాలనేది నరేష్ ఆలోచన అని.. కానీ ఇది బయోపిక్ కాదని.. నాన్ బయోగ్రఫీ సినిమా అని అంటున్నారు.
నరేష్ - పవిత్రల బంధంపై సినిమా వస్తోందనే వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ సినీ ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందించిన సినిమాలు చాలానే వచ్చాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిక్షనల్ రియాలిటీ జోనర్ అంటూ ఇప్పటికీ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ మూవీస్ తీస్తున్నారు.
కాకపోతే తమ రిలేషన్ షిప్ పై అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్న తరుణంలో.. ఇలా వారి లైఫ్ లోని సంఘటనలపై సినిమా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం నరేష్ - పవిత్ర టాలీవుడ్ లో బిజీ క్యారక్టర్ ఆర్టిసులుగా కొనసాగుతున్నారు. మరి త్వరలోనే తమ సినిమాపై నిజా నిజాలను వెల్లడిస్తారేమో చూడాలి.
ఇకపోతే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆ మధ్య కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర లోకేష్ తమ మధ్యకు వచ్చినప్పటి నుంచి తమ కుటుంబానికి ఇబ్బందులు మొదలయ్యాయని ఆరోపించింది. నరేష్ తన గురించి మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. నరేష్ తో తనకు ఇంకా సంబంధాలు తెగిపోలేదని.. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపింది.
దీనిపై నరేష్ స్పందిస్తూ.. రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. బెంగళూర్ లోని బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలసి తనపై వదంతులు సృష్టిస్తుందని అన్నారు. డబ్బు కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని.. గతంలోనూ ఇలాగే చేసిందని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ఆమెకి దూరంగా ఉంటున్నానని.. విడాకుల నోటీసులు పంపించినప్పటి నుంచి తాను వేరే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సృష్టించిందని నరేష్ పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ కూడా దీనిపై స్పందిస్తూ.. ఈ విషయంలో తనకు నరేష్ కు అభిమానులు మద్దతు ఇవ్వాలని కోరింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.