పుష్ప-1 రిలీజైంది. బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధిస్తోంది. సునాయాసంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100కోట్ల వసూళ్లను అధిగమించింది. బుక్ మై షోలో 8రోజుల్లోనే 35లక్షల టికెట్ల అమ్మకాలతో పుష్ప సరికొత్త రికార్డును సాధించిందని రిపోర్ట్ అందింది.
అందుకే ఇప్పుడు పుష్ప2 పైనా ఆసక్తి నెలకొంది. పుష్ప రెండో భాగాన్ని ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళతామని సుకుమార్ ప్రకటించడంతో బన్ని అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ నెలకొంది. అయితే పుష్ప రెండు భాగాల చిత్రీకరణలకు సంబంధించిన రకరకాల ప్రచారం ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది. వాస్తవానికి పుష్ప మేకర్స్ ఇప్పటికే నాలుగు గంటల సినిమాను చిత్రీకరించేసారని.. సినిమా రెండవ భాగాన్ని బయటకు తీసుకురావడానికి వారు కేవలం ఒక గంట కంటెంట్ ను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ ఉంది. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే చిత్రీకరించిన సన్నివేశాల్లోని అదనపు సన్నివేశాలను ఎడిట్ చేసాక పుష్ప 1ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు. పుష్ప 2 కి సంబంధించి భారీ ఫుటేజ్ ని ల్యాబ్ లోనే దాచి ఉంచారన్న టాక్ వినిపిస్తోంది. అయితే రెండో భాగం కోసం చిత్రీకరించాలనుకున్న సీన్లు ఇప్పుడు ఎడిటింగ్ చేయబడిన ఫుటేజ్ గా మిగిలి ఉంది. కానీ ఈ ఫుటేజ్ పార్ట్ 2కి ఉపయోగపడదన్న గుసగుస వైరల్ అవుతోంది. ఇప్పటికే చిత్రీకరించిన భాగం నుండి పావుగంటకు సరిపడే ఫైనల్ కట్ మాత్రమే ఉందనేది ఇన్ సైడ్ టాక్. రెండవ భాగం పుష్ప: రూల్ కి ఈ ఫుటేజ్ మాత్రం ఉపయోగపడుతుంది. సీక్వెల్ చేయడానికి సుకుమార్ మరో వంద రోజులు షూట్ చేయాల్సి ఉంటుందని గుసగుస వినిపిస్తోంది.
అయితే ఇది నిజంగా షాకిచ్చే నిజం. ఎందుకంటే పుష్ప 1 రిలీజైన కొద్దిరోజులకే సినిమాని విడుదల చేసేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారని అభిమానులు భావించారు. ఇప్పటికే పార్ట్ 2 ని కూడా సగభాగం పైగా చిత్రీకరించేశారని నమ్మారు. కానీ ఇప్పుడు సీన్ అలా లేదట. ఇకపోతే పుష్ప 1లో లీడ్ చేసిన పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేసేది రెండో భాగంలోనే. అందుకే దీనికి చాలా సమయం వెచ్చించాలి. స్క్రిప్ట్ పరంగా కూడా రెన్యువల్ చేయాల్సి రావొచ్చు. అందువల్ల ఇంకో వంద రోజులు లేదా వచ్చే ఏడాదంతా మేకింగ్ కే సమయం సరిపోవచ్చని అంచనా. 2021 డిసెంబర్ లో పుష్ప-1 వస్తే 2022 డిసెంబర్ నాటికి కానీ పుష్ప 2 రాకపోవచ్చని గుసగుస వినిపిస్తోంది. మరి దీనిపై సుకుమార్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.