సీనియర్ దర్శకులకు అవకాశాలిచ్చి రీమేక్ లకు ప్రాధాన్యతనిస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్న స్టార్ హీరోలు కొత్త కుర్రాళ్లకు ఛాన్సులిచ్చేందుకు వెనకాడడం లేదు. స్క్రిప్టుతో మెప్పిస్తే చాలు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున.. డార్లింగ్ ప్రభాస్ ఇంతకుముందు ఇలాంటి సాహసాలు చేసారు. సుజీత్ .. రాధాకృష్ణ లాంటి నవతరం దర్శకులకు ప్రభాస్ భారీ పాన్ ఇండియా అవకాశాల్ని కల్పించడం ఒక సంచలనం.. కాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ప్రభాస్ బాటలోనే నేటితరానికి అవకాశాలిస్తున్నారని సమాచారం.
తాజా సమాచారం మేరకు సాహో దర్శకుడు సుజీత్ కి పవన్ కల్యాణ్ అవకాశమిచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వినోదయ్య సితమ్ అనే తమిళ హిట్ చిత్రం రీమేక్ కానుంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని తెలిసింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ సినిమా తీసిన నిర్మాణ సంస్థలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేస్తుండడం ఉత్కంఠ పెంచే ఎలిమెంట్ అయితే.. సాహో లాంటి భారీ టెక్నికల్ యాక్షన్ మూవీని తీసిన సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండం మరో ఆసక్తికర విషయం. ఒక రకంగా పవన్ డేర్ చేసినా కానీ ఇది సంచలనాత్మక కాంబినేషన్ కానుంది.
సాహో హిందీ బెల్ట్ లో పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ కి అది ప్లస్ అవుతుందే కానీ మైనస్ కాదు. ఇక సుజీత్ సినిమా ప్రారంభం కాక ముందే సురేందర్ రెడ్డి.. హరీష్ శంకర్ లతో సినిమాల్ని పవన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు కమిట్ మెంట్లు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ పై లీకులు
త్రివిక్రమ్ - సాగర్ చంద్రతో కలిసి భీమ్లా నాయక్ తో బంపర్ హిట్ కొట్టిన పవన్ ఈసారి త్రివిక్రమ్ - సుజీత్ కాంబినేషన్ తో వినోదయ్య.. రీమేక్ కోసం సన్నాహకాల్లో ఉన్నాడని సమాచారం. అయితే అంతకుముందే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో `భవధీయుడు భగత్ సింగ్` అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో వస్తుందన్న ఈ చిత్రంపై సరైన క్లారిటీ లేదు.
ప్రస్తుతం అన్ని పనులు జరుగుతున్నాయని దర్శకుడు హరీష్ ట్విట్టర్ లో స్పష్టం చేశారు. హరీష్ ట్విట్టర్ లో వాయిస్ నోట్ ను షేర్ చేశారు. ``హాయ్ గైస్.. భవదీయుడు భగత్ సింగ్ అప్ డేట్ ల కోసం చాలా మంది నన్ను అడుగుతున్నారు. సినిమాలో టైమింగ్ తో పాటు.. సినిమా టైమింగ్ కూడా అంతే ముఖ్యం అని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను మీతో పంచుకుంటాను.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయి. మీ సహనం మద్దతు కి చాలా ధన్యవాదాలు`` అని అన్నారు. కానీ సినిమా మొదలెట్టేదెపుడో మాత్రం చెప్పలేదు. పవన్ కోసం హరీష్ కూడా పాన్ ఇండియా కంటెంట్ రెడీ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
వీరమల్లు గెటప్ ఛేంజ్
పవన్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ హరి హర వీర మల్లుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని తెలిసింది. ఇది చాలా కాలం నుండి చిత్రీకరణ దశలో ఉంది. కోవిడ్ వల్ల షెడ్యూల్స్ ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ తన డేట్స్ కేటాయించారు. చిత్రీకరణ వేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా. భారతదేశంలో ప్రవేశించిన బ్రిటీష్ వారి దోపిడీ నేపథ్యం.. కోహినూర్ వజ్రం.. నెమలి సింహాసనం దొంగతనం నేపథ్యంలో కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కంటెంట్ ఉంటుందని ఇంతకుముందు టాక్ వినిపించింది.
ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ స్నేహితుడు ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.