మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ''హీరో'' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ ను రివీల్ చేసి టీజర్ ను కూడా వదిలారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అశోక్ హ్యాండ్సమ్ గా మేనమామ కు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించాడు. ఇక యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇందులో అశోక్ ను బాగా ప్రెజెంట్ చేసినట్లు అర్థం అవుతోంది. ఒక్క టీజర్ లోనే కౌబాయ్ - లవర్ బాయ్ - యాక్టన్ హీరో - జోకర్.. ఇలా ఓ డెబ్యూ హీరో లాంఛింగ్ కి ఏమేమి ఉండాలో అన్ని ఉండేలా చూసుకున్నారు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో 4 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. 'హీరో' అనే టైటిల్ విషయంలోనే సూపర్ స్టార్ అభిమానులు కాస్త కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే 'హీరో' అనే పేరుకు.. ఆ టైటిల్ కు ఇండస్ట్రీలో చాలా బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఇదేమీ కొత్త టైటిల్ కాదు. తెలుగు తమిళ హిందీ.. ఇలా అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ టైటిల్ తో సినిమాలు వచ్చేశాయి. హిందీలో జాకీష్రాఫ్ - సన్నీ డియోల్ - సూరజ్ పంచోలి.. 'హీరో' టైటిల్ తో సినిమాలు చేశారు. ఆ మధ్య తమిళ్ లో శివ కార్తికేయన్ 'హీరో' అంటూ వచ్చాడు. ఇక తెలుగులో చిరంజీవి 1984లో అదే టైటిల్ తో సినిమా చేశాడు. 2008లో నితిన్ కూడా 'హీరో' అన్నాడు. అయితే ఇంతవరకు ఈ టైటిల్ పెట్టి తీసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇతర భాషల సంగతి పక్కనపెడితే.. తెలుగులో మాత్రం 'హీరో' టైటిల్ తో వచ్చిన సినిమాలు డబుల్ డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు అదే టైటిల్ తో మహేష్ మేనల్లుడికి ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకి ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పట్టుబట్టి దీన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి బ్యాడ్ సెంటిమెంట్ కు ఎదురెళ్తున్న కృష్ణ మనవడు అశోక్ ఆ చైన్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.