ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం పుల్ స్టాప్ పెడుతుందని అందరూ భావిస్తున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు - చిత్ర పరిశ్రమకు రాయితీలు - సినీ కార్మికులకు ప్రోత్సాహకాలు మరియు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లమ్స్ పై ఈరోజు చర్చించనున్నారు.
ఏపీలో పరిశ్రమ అభివృద్ధితో సహా మొత్తం 17 అంశాలను సీఎం ముందు పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖుల బృందం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. చిరంజీవితో పాటుగా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - నిరంజన్ రెడ్డి - ఆర్ నారాయణ మూర్తి - పోసాని కృష్ణ మురళి - అలీ తదితరులు జగన్ తో సమావేశం అవుతున్నారు.
ఈసారి సినీ ఇండస్ట్రీకి అనుకూలంగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇవాళ దీనికి శుభం కార్డ్ పడకపోతే.. ఏపీని లైట్ తీసుకొని ఇండస్ట్రీ ఎండ్ కార్డ్ వేస్తుందేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు కలిసినా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాలేదని.. అందుకే టాలీవుడ్ పెద్దలు సీఎంతో భేటీకి దూరంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ వంటి అగ్ర హీరోలు దర్శకులు వెళ్లినా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అవ్వకపోతే మిగతా వాళ్ళు కూడా ఏపీని లైట్ తీసుకుంటారేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ కు సపోర్ట్ గా నిలవకపోతే సినీ ప్రముఖులంతా ఇకపై పూర్తిగా తెలంగాణా రాష్ట్రం మీదనే ఫోకస్ పెడతారేమో అని ఫిలిం సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
సామాన్యులకు సినిమా టికెట్ ధర అందుబాటులో ఉండాలంటూ థియేటర్ లో ధరలు తగ్గించడంతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య మొదలైంది. గతేడాది ఏప్రిల్ లో దీనిపై జీవో విడుదల చేయబడింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. జగన్ సర్కారు నిర్ణయం మీద పలువురు సినిమా ప్రముఖులు బాహాటంగా అసహనం వ్యక్తం చేసారు. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు.
ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల మీద ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఇప్పటికే దీనిపై నివేదిక కూడా రెడీ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు సినీ ప్రముఖులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ తో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుంటుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.