ప్ర‌భాస్ విష‌యంలో జ్యోతిష్యుడి మాట నిజ‌మౌతుందా?

Update: 2022-03-08 10:30 GMT
'బాహుబ‌లి'తో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అందుకే ఈ మూవీ త‌రువాత ఆయ‌న పాన్ ఇండియా స్థాయి చిత్రాల‌కే ప్రాధాన్య‌త నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా వున్న ఏకైక న‌టుడిగా ప్ర‌భాస్ ప్ర‌ముఖంగా నిస్తున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ఐదు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీగా వున్నారు. వీటి టోట‌ల్ బ‌డ్జెట్ విలువ 2000 కోట్ల‌కు పైనే వుంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. తాజాగా ఈ భారీ పాన్ ఇండియా సినిమాల లిస్ట్ నుంచి 'రాధేశ్యామ్‌' రిలీజ్ కాబోతోంది.

భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు బాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ల‌లో ప్ర‌స్తుతం హీరో ప్ర‌భాస్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూ వైర‌ల్ గా మారింది. అదే ప్ర‌భాస్ పెళ్లి న్యూస్‌. ఆర‌డుగుల అజానుభాహుడిలా వుండే ప్ర‌భాస్ ఇండ‌స్ట్రీ అంద‌రికి ప్రియ‌మైన డార్లింగ్‌. త‌ను కూడా అంద‌రిని అలాగే పిలుస్తుంటారు.

మ‌రి అలాంటి డార్లింగ్ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ఆయ‌న అభిమానులు సామాన్య ప్రేక్ష‌కులు గ‌త కొంత కాలంగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబ‌లి' చిత్రాల త‌రువాత పెళ్లి చేసుకుంటాన‌ని తాను ఇంట్లో వాళ్ల‌కి చెప్పిన‌ట్టు గ‌తంలో ప్ర‌భాస్ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే 'బాహుబ‌లి'.. సాహో చిత్రాలు కూడా విడుద‌ల‌య్యాయి కానీ ప్ర‌భాస్ త‌న మాట‌ని నిల‌బెట్టుకోలేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి విష‌యం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌ముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్ కుమార్ తాజా ప్ర‌భాస్ పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఓ వీడియోని సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌భాస్ ఈ ఏడాది ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకుంటార‌ని ఆయ‌న చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం  ఆచార్య వినోద్ కుమార్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆయ‌న విడుద‌ల చేసిన వీడియోలో ప్ర‌భాస్ ఈ ఏడాది అక్టోబ‌ర్ నుంచి వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు.

'న‌టుడు ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే వివాహం చేసుకుంటారు. అక్టోబ‌ర్ 2022 నుంచి అక్టోబ‌ర్ 2023 మ‌ధ్య‌లో ఆయ‌న ఖ‌చ్చితంగా వివాహం చేసుకుంటారు. ఇది పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విష‌యంలో నా జ్యోతిష్యం' అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆచార్య వినోద్ కుమార్ షేర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం 'రాధేశ్యామ్‌' ఈ నెల 11న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్య‌శ్రీ న‌టించారు.
Tags:    

Similar News