జక్కన్నకు ముందే త్రివిక్రమ్‌ భారతాన్ని తీసుకు వస్తాడా?

Update: 2021-01-08 16:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తన కెరీర్ చివరి వరకు అయినా మహా భారతం తీస్తాను అంటూ చాలా సందర్భాల్లో ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం తనకు ఉన్న అనుభవం మరియు తనకు తెలిసిన టెక్నికల్ విషయాలు మహా భారతంను తెరకెక్కించేందుకు సరిపోవు అంటూ రాజమౌళి గతంలో చెప్పుకొచ్చాడు. జక్కన్న మహా భారతం తీస్తే ఖచ్చితంగా అది ఇండియన్‌ సినిమా చరిత్రలో రాబోయే వంద ఏళ్ల వరకు నిలిచి పోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈమద్య జక్కన మహా భారతం న్యూస్‌ రావడం లేదు. ఈ సమయంలోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహా భారతం మరియు రామాయణం సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్‌ లో చర్చ జరుగుతోంది.

గత ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన త్రివిక్రమ్‌ కరోనా కారణంగా గత ఏడాది మొత్తం ఖాళీగానే ఉన్నాడు. ఆ సమయంలో తన కలంకు పని చెప్పాడు. ఎన్టీఆర్‌ 30 సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన త్రివిక్రమ్‌ పలు సినిమాలకు స్క్రీన్‌ ప్లే అందించడంతో పాటు రామాయణం మరియు మహా భారతం స్క్రిప్ట్‌ లపై దృష్టి పెట్టాడని.. ఇప్పుడు కాకున్నా కొన్నాళ్ల తర్వాత అయినా త్రివిక్రమ్‌ తనదైన శైలిలో రామాయణ మరియు మహాభారతం సినిమాలను తెరకెక్కించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు లీక్ ఇస్తున్నారు. అదే జరిగితే జక్కన్న మహాభారతం కంటే త్రివిక్రమ్‌ మహా భారతం ముందు వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News