ఇక్కడ కూడా కట్టప్ప ఉంటే బాగుండేది కదా డార్లింగ్‌

Update: 2022-03-07 11:33 GMT
ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా సౌత్‌ వర్షన్ మరియు హిందీ వర్షన్ వేరు వేరుగా తెరకెక్కించినట్లుగా ముందు నుండి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం తెలుగు లో కృష్ణం రాజును తమిళం మరియు కన్నడం వర్షన్ ల కోసం సత్యరాజ్ ను మరియు హిందీ వర్షన్ కు మిథున్ చక్రవర్తిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

మిథున్ చక్రవర్తి విషయంలో క్లారిటీ ఇవ్వని మేకర్స్ కృష్ణం రాజు మరియు సత్యరాజ్ ల విషయంలో క్లారిటీ ఇచ్చారు. తెలుగు లో కృష్ణం రాజు కనిపించబోతున్న అదే పాత్రలో సత్యరాజ్‌ ను ఇతర భాషల్లో చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా చెన్నై ప్రమోషన్‌ ఈవెంట్‌ లో భాగంగా సత్యరాజ్ గురించి మాట్లాడిన ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను తెలియజేసి సినిమాపై మరింతగా ఆసక్తి కలిగేలా చేశాడు.

రాధేశ్యామ్ సినిమా లో సత్యరాజ్ ను నటింపజేయడం తో తనకు సెంటిమెంట్‌ గా కలిసి వస్తుందని ప్రభాస్ అన్నాడు. మిర్చి మరియు బాహుబలి సిరీస్ ల్లో సత్యరాజ్ నటించాడు. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక రాధేశ్యామ్‌ కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు.

సత్యరాజ్ తో తనకు చాలా ఆత్మీయ సన్నిహిత్యం ఉన్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు.

ఇదే సమయంలో ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్‌ తెలుగు వర్షన్ లో కూడా సత్యరాజ్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి మంచి విజయాన్ని రాధేశ్యామ్‌ దక్కించుకుంటుందని వారు భావిస్తున్నారు. ప్రభాస్ మరియు కృష్ణం రాజులు కలిసి నటించిన సినిమాలు పెద్దగా విజయాలను దక్కించుకోలేదు. కనుక రాధేశ్యామ్‌ తెలుగు వర్షన్ లో కూడా సత్యరాజ్ ఉండాల్సింది డార్లింగ్‌ అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలో ముఖ్య పాత్ర కోసం కృష్ణం రాజు నటించడం ను కొందరు అభిమానులు హర్షిస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా ఈ తండ్రి కొడుకులను కలిపి చూసిందే లేదు. కనుక ఇన్నాళ్లు అయినా వీరిద్దరి కాంబో రాబోతున్నందుకు వారు సంతోషంగా ఉన్నారు. ప్రతి సన్నివేశం కూడా ఒక అద్బుతం అన్నట్లుగా.. విజువల్‌ వండర్ అన్నట్లుగా దర్శకుడు రాధాకృష్ణ మల్చిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు.
Tags:    

Similar News