బ‌స్టాండ్ లో చాలా రాత్రుళ్లు నిద్రించాల్సి వ‌చ్చింది

Update: 2022-01-08 14:30 GMT
క‌న్న‌డ రాక్ స్టార్ య‌శ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `కేజీఎఫ్` బ్లాక్ బ‌స్ట‌ర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒకే ఒక్క స‌క్సెస్ య‌శ్ ని అంత‌టి వాడిని చేసింది. అప్ప‌టివ‌ర‌కూ క‌న్న‌డకే ప‌రిశ్ర‌మ‌కే ప‌రిచ‌య‌మైన య‌శ్ ఒక్క‌సారిగా నేష‌న‌ల్ లెవ‌ల్లో పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడా స‌క్సెస్  అన్ని భాష‌ల్లోనూ అవ‌కాశాలు తెచ్చిపెడుతుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు య‌శ్ ని ఉత్త‌రాదికి తీసుకెల్లిపోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్  లేకుండా క‌న్న‌డ ఇండ‌స్ర్టీలో అడుగు పెట్టి నేడు నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. మ‌రి అంత‌టి స్టార్ స్టేట‌స్ వెనుక శ్ర‌మ  గురించి ఆయ‌న 36వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ సారి నెమ‌ర వేసుకుంటే..

య‌శ్ 1986-జ‌న‌వ‌రి 8న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలోని ఓ చిన్న ప‌ట్ట‌ణంలో జ‌న్మించాడు. య‌శ్ తండ్రి సాధార‌ణ కేఎస్ ఆర్టీసీ  డ్రైవ‌ర్. చ‌దువు పూర్త‌యిన వెంట‌నే ఇంట్లో వాళ్ల‌ని ఒప్పించి మూడు వంద‌ల‌ రూపాయ‌ల‌తో  బెంగుళూరులో  అడుగు  పెట్టాడు య‌శ్. బంధువుల ఇంటికి వెళ్ల‌డానికి మ‌న‌సు ఒప్ప‌క కెంపెగౌడ్ బ‌స్టాండ్ లో చాలా రాత్రుళ్లు నిద్రించాల్సి వ‌చ్చిందిట‌. రోజూ బ‌స్టాండ్ లో ప‌డుకుంటున్న య‌శ్ ఆనాడే అదే బ‌స్టాండ్ లో త‌న  క‌టౌట్  ప‌డాలని డిసైడ్ అయ్యాడు. చివ‌రికి ఎంతో శ్ర‌మించాక సీరియ‌ల్స్ లో అవ‌కాశాలు ద‌క్కించుకున్నాడు.  ఆ త‌ర్వాత సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ కి ప్ర‌మోట్  అయ్యాడు.


2008 లో `మొగ్గిన మ‌న‌సు` చిత్రంలో హీరోగా న‌టించాడు. అందులో రాధికా పండిట్ హీరోయిన్. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌టం..సినిమా హిట్ అవ్వ‌డంతో 2016లో  ఆ ఇద్ద‌రు  వైవాహిక బంధంతో ఒక‌ట‌య్యారు. ఆ త‌ర్వాత చాలా సినిమాల్లో హీరోగా న‌టించాడు. ఆ త‌ర్వాత 2018 లో య‌శ్ న‌టించిన `కేజీఎఫ్` రిలీజ్ అవ్వ‌డం..అది పాన్ ఇండియా స‌క్సెస్ అవ్వ‌డంతో అత‌ని  కెరీర్ ఒక్క‌సారిగా ట‌ర్న్ అయింది. ఆ స‌క్సెస్ తో పారితోషికం 15 కోట్ల‌కు పెంచేసాడు. `కేజీఎఫ్` 200 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో య‌శ్ మార్కెట్ రెట్టింపు అయింది. ప్ర‌స్తుతం `కేజీఎఫ్ -2` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.  ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమాని ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఇది హిట్ అయితే య‌శ్ క్రేజ్ అంత‌కంత‌కు పెరిగిపోవ‌డం ఖాయం. 
Tags:    

Similar News