కన్నడ రాకింగ్ స్టార్.. కేజీఎఫ్ స్టార్ యష్ పేరు ఇటీవల ఓ వివాదం కారణంగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. తన పొలంలో ఉన్న ఫామ్ హౌస్ పరిసరాల్లో రోడ్ వేయాలన్న ప్రతిపాదనకు అడ్డు చెప్పడంతో వివాదాస్పదమైంది.
రాకింగ్ స్టార్ యష్ కర్ణాటక రైతుల కోపాన్ని తీర్చేందుకు రాజీకొచ్చారని ప్రచారమైంది. యష్ తల్లిదండ్రులు గ్రామ స్థానికుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి కెజిఎఫ్ స్టార్ యష్ పై రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నాజప్ప డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. హాసన్ జిల్లాలోని దుద్దా హోబ్లి తిమ్మలాపూర్ గ్రామానికి సమీపంలో యష్ ఒక భూమిని కొన్నారు. రైతుల గురించి ఇంత ఎక్కువగా మాట్లాడే యష్ తన ఆస్తిని కాపాడటానికి తన పొలం గుండా రహదారి వేయనీకుండా అడ్డుకున్నారని అక్కడి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యష్ కుటుంబానికి వ్యతిరేకంగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రహదారికి అడ్డంగా కాంపౌండ్ వాల్ నిర్మించడం ద్వారా రైతులు వాడుతున్న రహదారిని యష్ కుటుంబీకులు అడ్డుకున్నారని రైతులు ఆరోపించారు.
ఈ వివాదంలో గ్రామస్తులపై దాడి చేయడానికి యష్ సన్నిహితులు కొందరు గూండాలను పంపారని కూడా అన్నాజప్ప అనే రైతు సంఘ నాయకుడు ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను అభ్యర్థించారు.
అయితే ఈ వివాద సమయంలో యష్ తన తదుపరి చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్ కానుండగా యష్ పోస్ట్ ప్రొడక్షన్స్ టెన్షన్ లో ఉన్నారు. కానీ ఈలోగా వివాదం వేడెక్కించింది.
ఎట్టకేలకు సమస్యను పరిష్కరించుకుని ఇదిగో ఇలా తన పొలంలోని ఫామ్ హౌస్ పరిసరాల్ని దుక్కి దున్నించి చదును చేయిస్తున్నారు యష్. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అన్నట్టు రోడ్ వివాదం పూర్తిగా సద్ధుమణిగినట్టేనా? దానికి యష్ మధ్యేమార్గంగా పరిష్కారం చూపించారా?