రాఖీభాయ్ వార్ డిక్లేర్ చేశాడు. చాలా రోజులుగా సైలెంట్ అయిపోయిన `కేజీఎఫ్ చాప్టర్ 2` దర్శకుడు ప్రశాంత్ నీల్ శనివారం హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాప్టర్ 2 రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. హెచ్చరిక ముందుంది డేంజర్.. ఏప్రిల్ 14, 2022న ఈ రాక్షసుడు ప్రపంచాన్ని జయించే వరకు వేచి వుండలేము` అంటూ రిలీజ్ డేట్ పోస్టర్ ని షేర్ చేశారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
సైలెంట్ గా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో కన్నడ స్టార్ యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ ల వర్షం కురిపించింది.
పిరియాడిక్ కాలం నాటి ఫిక్షనల్ కథగా మాన్స్టర్ లాంటి ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీకి దేశ వ్యాప్తంగా పాపులారిటీని తీసుకొచ్చింది. రాఖీ భాయ్ పాత్రలో యష్ పలికించిన అభినయం, యాక్షన్ ఘట్టాల్లో రాఖీ నటించిన తీరు ప్రతీ ఒక్క మాస్ ఆడియన్ ని కట్టిపడేశాయి. ఇక ప్రశాంత్ నీల్ `బాహుబలి` తరహాలో ఈ చిత్రాన్ని టూ పార్ట్స్ గా మలిచిన తీరు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సినిమాని పరిగెత్తించిన విధానం ప్రశంసలు కురిపించింది.
ఓ గ్యాంగ్‌స్టర్ కథని వెండితెరపై పవర్ ఫుల్ స్టోరీగా ఆవిష్కరించిన విధానానికి మేకర్స్ సైతం ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు, అతని టాలెంట్ కి ఖుడోస్ అంటూ నీరాజనాలు పలికారు. తొలి పార్ట్ సంచలన విజయం సాధించడంతో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ మూవీ ఇప్పటికే రికార్డు సృష్టించి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ మధ్య విడుదల చేసిన చాప్టర్ 2 ట్రైలర్ 230 ప్లస్ మిలియన్ వ్యూస్ ని రాబట్టి యూట్యూబ్ లో సరికొత్త రికార్డుని సెట్ చేసింది.
దీంతో చాప్టర్ 2పై అంచనాలు ఆకాశాన్నంటాయి. దీనికి ప్రధాన కారణం బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర అయినటు వంటి అధీరాగ కనిపించనుండటం.. ప్రధాని రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ నటించడం... సీబీఐ ఆఫీసర్‌గా రావు రమేష్, మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ .. ఇలా పాపులర్ నటులు, వారి పాత్రలని ట్రైలర్ లో పరిచయం చేయడంతో పార్ట్ 2 అంచనాలకు అందని స్థాయిలో వుండబోతోందని స్పష్టమైంది.
తాజాగా యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఏప్రిల్ 14న వచ్చేస్తోందంటూ దర్శకుడు ప్రకటించేశాడు. ఈ రాక్షసుడు ఏప్రిల్ 14న ఈ ప్రపంచాన్ని జయిస్తాడని చాలా కాన్పిడెంట్ గా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేయడంతో రాఖీభాయ్ వార్ డిక్లేర్ అయిపోయింది. ఇదే నెలలో రావాలని ఎదురుచూస్తున్న `ఆర్ ఆర్ ఆర్`, రాధేశ్యామ్ లకు ఈ మూవీ గట్టి పోటీని ఇవ్వడం ఖాయమని, బాక్సాఫీస్ వద్ద ఫైట్ మామూలుగా వుండదని స్పష్టమవుతోంది. రాఖీభాయ్ తో పోటీకి మన వాళ్లు కూడా సై అంటూ సైరన్ మోగిస్తారో చూడాలి.