ఒకప్పుడు ఒక సినిమా పట్టణాల నుంచి టౌన్లకు రావడానికి చాలా రోజులు పట్టేది. అప్పట్లో థియేటర్లు తక్కువగా ఉండటం వలన, ఎక్కువ రోజులు ఆడేవి. చుట్టుపక్కల పల్లెల్లోని వాళ్లు టౌన్లకి వచ్చి సినిమాలు చూడటం ఎక్కువ కనుక, థియేటర్లలో ఆ సినిమాలు ఎక్కువ రోజులు నిలబడ్డాయి. 100 రోజులు కాదు .. ఏకధాటిగా 365 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా ముఖచిత్రం మారిపోయింది .. పాన్ ఇండియా సినిమాగా ఎదిగిపోయింది. ఒకే రోజున ప్రపంచమంతటా విడుదలవుతోంది. ఇప్పుడు సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అనే విషయం తెలియడానికి 100 రోజుల కొలమానం అవసరం లేదు ... ఒకరోజు ఆడితే తెలిసిపోతుంది.
కథా కథనాలు .. మాటలు .. పాటలు .. అందువలన లభిస్తున్న ఆదరణను బట్టి, ఒక సినిమా విజయవంతమైందనే విషయాన్ని చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు .. ఆ మాట చెప్పడానికి ఆధారమయ్యే లెక్కలు వేరు. లాభాలు వస్తే ఆ సినిమా హిట్ అయిందనే అర్థం. పెట్టుబడిలో సగం తొలి రోజునే వస్తే బ్లాక్ బస్టర్ అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో .. ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. అందువలన ఓపెనింగ్స్ కి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. 'ఒక మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పచ్చు' అన్నట్టుగా ఓపెనింగ్స్ ను చూసి, ఆ సినిమా హిట్టో కాదో చెప్పచ్చు అనేది స్పష్టమైపోయింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది థియేటర్లకు రానున్న పాన్ ఇండియా సినిమాలలో, తొలిరోజు వసూళ్ల విషయంలో ఏది ముందంజలో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. అప్పుడే అభిమానులు ఈ సినిమాలను గురించి చర్చించుకుంటున్నారు. విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో తెలుగు నుంచి 'ఆర్ ఆర్ ఆర్' .. హిందీ నుంచి 'ఆది పురుష్' .. కన్నడ నుంచి 'కేజీఎఫ్ 2' సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో రికార్డుస్థాయి ఓపెనింగ్స్ 'కేజీఎఫ్ 2'కి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. ఒక కన్నడ సినిమా బాలీవుడ్ సినిమాలను సైతం భయపెట్టేసింది. అంతకుముందు యష్ కి భయంకరమైన క్రేజ్ లేకపోయినప్పటికీ, ఈ సినిమా ప్రపంచపటాన్ని ఆక్రమించింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'కేజీఎఫ్ 2'కి ఇండియా వైడ్ గా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండొచ్చని అంటున్నారు. ఆ తరువాత స్థానంలో 'ఆర్ ఆర్ ఆర్' .. మూడో స్థానంలో 'ఆది పురుష్' కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
'బాహుబలి'తో రాజమౌళి పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆయన నుంచి వస్తున్న సినిమా కావడం వలన, 'ఆర్ ఆర్ ఆర్' సినిమాపై అసాధారణమైన అంచనాలు ఉన్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో .. ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్లడానికి ఎన్టీఆర్ - చరణ్ క్రేజ్ తోడవుతుంది. కానీ ఇతర భాషల్లో ఈ సినిమాను వసూళ్ల పరంగా పరిగెత్తించే అవకాశం రాజమౌళి పేరుకే ఉంది. ఆయన నడిపించే కథాకథనాలు .. పవర్ఫుల్ పాత్రలతో తెరపై చేయించే విన్యాసాలపైనే వసూళ్లను పెంచే భారం పడనుంది.
ఇక ప్రభాస్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా 'బాహుబలి'నే. ఆయన కూడా ఈ సినిమా తెచ్చిన క్రేజ్ ను వెంటబెట్టుకునే 'ఆది పురుష్' వసూళ్ల వేటకి వెళ్లవలసి ఉంటుంది. వందల కోట్ల బడ్జెట్ తో .. రామాయణ ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందుతోంది. ఆజానుబాహుడు .. మహా పరాక్రమవంతుడు అయిన శ్రీరాముడి పాత్రకి ప్రభాస్ అతికినట్టుగా సరిపోతాడనే అభిప్రాయం అందరిలోను ఉంది. అయితే అటు 'ఆర్ ఆర్ ఆర్' గానీ .. ఇటు 'ఆది పురుష్' గాని ఓపెనింగ్స్ విషయంలో 'కేజీఎఫ్ 2'తో పోటీపడలేవని అంటున్నారు. ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ ల కంటే ఇతర భాషల్లో యష్ కి ఎక్కువ క్రేజ్ ఉండటమే అందుకు కారణమనే ఉదాహరణలు చూపిస్తున్నారు.