యంగ్ టైగ‌ర్ బిరియానీ వాస‌న కూడా పీల్చ‌డం లేదుట‌!

Update: 2022-12-09 03:59 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌ప్పుడు మంచి ఫుడీ. ఇష్ట‌మైన రుచుల‌న్నింటిని క‌డుపునిండా తృప్తిగా ఆర‌గించేవాడు. అందులోనూ నాన్ వెజ్ వంట‌కాలంటే? త‌ప్ప‌నిస‌రిగా ఓ ప‌ట్టు ప‌ట్టాల్సిందే. ఇక హైద‌రాబాద్ బావ‌ర్చి బిరియానీ అయితే అతు చూడాల్సిందే. ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఒక్క‌డే తినేసిన రోజులెన్నో. న‌లుగురైదుగురు తినాల్సిన బిరియానీ ఒక్క‌డే ఆగ‌రించిన రోజులెన్నో ఉన్నాయ‌ని తానే స్వ‌యంగా చెప్పాడు.

అలాగే అమ్మ చేతి బిరియానీ వంట అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. ఆదివారం  వ‌చ్చిందంటే బిరియానీ వాస‌న ఇంట్లో ఘుమ ఘుమలాడాల్సిందే. రోజుంతా బిరియానీతో ముఖం మొత్తేలా తినాల్సిందే. ఇక తార‌క్ లో మ‌రో స్పెషాల్టీ. నెయ్యిలో ఇడ్లీలు ముంచుకుని....చ‌ట్నీ కలుపుకుని తింటే ఆ రుచి ఎలా ఉంటుందో తిన్న వాడికే తెలుస్తుదని మ‌హేష్ తోనే చెప్పాడు.

మ‌హేష్ ని ఒక్క‌సారి అలా ట్రై చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. ఇదంతా తార‌క్ లో ఒక‌ప్పుడు క‌నిపించేది. కానీ నేడు ఆయ‌న డైట్  మొత్తం మారిపోయింది. డ్ర‌మ్ లుక్  నుంచి స్లిమ్ లుక్లో వ‌చ్చిన త‌ర్వాత అన్నింటిని త‌గ్గించుకుంటూ వ‌చ్చాడు. ఇప్పుడు బిరియానీలు గ‌ట్రా అన్నీచాలా ప‌రిమితంగానే తింటున్నాడుట‌. ఇంకా చెప్పాలంటే నొరు క‌ట్టేసుకుటున్నాడ‌ని తెలుస్తోంది.

ఇంట్లో బిరియానీలు త‌యారు చేయ‌డం కూడా మానేసారుట‌. అలాగే క‌ళ్యాణ్ రామ్ ఆదివారం వ‌స్తే బిరియానీ చేస్తున్నా నాన్న వ‌చ్చేయ‌మ‌న్నా? వ‌ద్దులే అని అని త‌ప్పించుకుంటున్నాడుట‌.

బిరియానీ వాస‌న చూస్తే టెంప్ట్ అవుతామ‌ని భావించిన హీరో గారూ ఆ  వాస‌న కూడా పీల్చ‌డం మానేసాడుట‌. లంచ్ అయ‌న త‌ర్వాత మాత్రమే ఇంటికెళ్తున్నాడుట‌.

లంచ్ టైమ్ లో వెళ్తే  తిన‌మ‌ని  ఇబ్బంది పెడతారని భావించి తానే వెళ్ల‌డం త‌గ్గించిన‌ట్లు స‌మాచారం. వీలైనంత వ‌ర‌కూ వెజ్ వంట‌కాలే రెగ్యుల‌ర్ గా తీసుకుంటున్నాడుట‌. చాలా అరుదుగానే నాన్ వెజ్ టేస్ట్ చూస్తున్న‌ట్లు స‌మాచారం. డైటీష‌న్లు ఇచ్చిన మెనూలో ఏది ఉంటే అది తిన‌డం త‌ప్ప‌! త‌న కిష్ట‌మైన వంట‌కాల‌న్ని దాదాపు దూరం చేసిన‌ట్లే తెలుస్తోంది. ఎంపిక చేసుకున్న రంగం అలాంటిది కాబ‌ట్టి క‌డుపు క‌ట్టుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News