తమకు ఎదురైన సమస్యల పరిష్కారం కోసం సెల్ టవర్లు ఎక్కి.. ప్రముఖులు రావాలన్న డిమాండ్లు పెట్టటం.. అందుకోసం నానా హడావుడి చేయటం తరచూ చూస్తున్నదే. కాకుంటే.. ఈసారి కాస్త భిన్నమైన పరిణామం చోటు చేసుకుంది. సెల్ టవర్ కు బదులుగా బెజవాడకు చెందిన యువతి ఒకరు చెట్టెక్కారు.
విజయవాడ రెవెన్యూ కాలనీలోని అగ్రిగోల్డ్ కార్యాలయం దగ్గర్లోని చెట్టు ఎక్కిన సదరు యువతి.. సినీ నటుడు మహేశ్ బాబు రావాలని హడావుడి చేసింది. మహేశ్ బాబు రావాలి.. మోడీతో మాట్లాడాలని..సీఎం జగన్ తన మొర ఆలకించాలంటూ ఆమె చేసిన రచ్చ స్థానికంగా సంచనలంగా మారింది.
సదరు యువతి ఫోటోలుకానీ.. వీడియోలు కానీ తీసే ప్రయత్నం చేసిన వారిపైన చెట్టు కొమ్ములు విసిరింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను కిందకు దించే ప్రయత్నం చేశారు. కానీ.. అందుకు ఆమె అడ్డుకుంది. మానసికంగా సరిగా లేదన్న సందేహానికి వచ్చిన పోలీసులు నిచ్చెన సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా ఆమె కోల్ కతా నుంచి విజయవాడకు వచ్చిందని.. అక్కడ కొద్దిమంది చేతిలో మోసపోయినట్లు గుర్తించారు. ఆమె ఆరోగ్యం బాగు అయ్యేందుకు వీలుగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.