RR ల నాటు డాన్స్‌ కు యూట్యూబ్‌ ఇండియా స్పెషల్‌ కాంప్లిమెంట్స్

Update: 2021-11-12 07:40 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్‌ ఆర్‌ పై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల విడుదల అయిన నాటు నాటు వీర నాటు సాంగ్ సినిమా రేంజ్ ను మరింతగా పెంచడంతో పాటు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి కలిగేలా చేసింది. రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్ ను లైక్స్ ను దక్కించుకుంటూ యూట్యూబ్‌ ను ఓ రేంజ్ లో దుమ్ము రేపుతోన్న ఈ పాటకు మరో అరుదైన గౌరవం దక్కింది. యూట్యూబ్‌ ఇండియా అఫిషియల్ ట్విట్టర్ పేజీలో ఆర్ ఆర్ ఆర్‌ నాటు నాటు పాట గురించి ట్వీట్ చేయడం జరిగింది.

యూట్యూబ్‌ అఫిషియల్ గా ఒక సినిమా గురించి లా స్పెషల్‌ గా పోస్ట్‌ చేయడం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి యూట్యూబ్‌ టీమ్‌ ప్రత్యేకంగా నాటు నాటు డాన్స్ గురించి ప్రస్థావించడం ఖచ్చితంగా మన ఆర్ ఆర్‌ ఆర్‌ కు దక్కిన అతి పెద్ద గౌరవం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

యూట్యూబ్‌ ఇండియా ట్విట్టర్ అకౌంట్ లో... నిజాయితీగా చెప్పాలంటే రామ్ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల డాన్స్ 0.5 స్పీడ్ లో చూస్తున్నా కూడా స్పీడ్ గానే అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. పాటలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లు ఏ రేంజ్ లో దుమ్ము రేపేలా డాన్స్ చేశారో ప్రతి ఒక్కరు చూశారు.

పాటలో రెండు స్టెప్స్‌ ను శాంపిల్ గా చూపించారు. అద్బుతమైన వారి స్పీడ్ కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇద్దరు హీరోల స్పీడ్ మరియు జోరు చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సత్తా చూపించబోతుందో అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ఆ స్టెప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో యూట్యూబ్‌ అఫిషియల్‌ టీమ్ కూడా అదే విషయాన్ని ప్రస్థావించి ప్రత్యేకంగా ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

రామ్‌ చరణ్‌.. రామారావుల డాన్స్ ను మరే ఇండియన్‌ ఫిల్మ్‌ స్టార్‌ మ్యాచ్ చేయలేనంత స్పీడ్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అద్బుతమైన విజువల్ వండర్ గా ఉండబోతున్న ఈ సినిమా లో రామ్‌ చరణ్‌ కు జోడీగా ఆలియా భట్‌ కనిపించబోతుంది. ఇక ఎన్టీఆర్‌ కు జోడీగా విదేశీ బ్యూటీ కనిపించబోతున్నారు.

అజయ్ దేవగన్ మరియు శ్రియాలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జనవరి 7న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాహుబలి రికార్డులను ఈజీగా బ్రేక్ చేస్తుందని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్నారు. దాదాపుగా 450 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఏ మేరకు చేస్తుందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు బిజినెస్ అయ్యింది. ప్రతి చోట కూడా రికార్డులు నమోదు అవుతున్నాయి.

విడుదల తర్వాత ఈ రికార్డులు కంటిన్యూ అవ్వడం ఖాయం అంటూ ఇప్పటికే విడుదల అయిన పాటలు మరియు వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి.


Tags:    

Similar News