మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. టీమ్ అంతా షూటింగ్ లో బిజీ అయింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజునిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. శంకర్ సినిమా అంటే కచ్చితంగా బడ్జెట్ విషయంలో రాజీ పడటానికి వీలుండదు. అడిగిందల్లా తెచ్చి ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతుంది. సినిమా అవుట్ పుట్ విషయంలో క్వాలిటీ అదే విధంగా ఉంటుంది.
తాజాగా ఈ సినిమా నిర్మాణంలో కి జీ-స్టూడియోస్ భాగమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ గాపేరొందిన జీ స్టూడియోస్ శంకర్ తెరకెక్కించడంతో నిర్మాణంలో భాగానికి ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. పెట్టుబడితో పాటు డిజిటల్..శాటిలైట్ రైట్స్ ని కూడా జీ స్టూడియోస్ తీసుకుంటుందని సమాచారం. అయితే ఇక్కడే ఓ సెంటిమెంట్ బలంగా చేస్తుందన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. తెలుగు సినిమాలకు సంబంధించిన జీ-5 మీద ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఇందులో వస్తున్న సినిమాలు ఎక్కువగా థియేటర్లు ఫెయిలైన సినిమాలే. ప్లాప్ సినిమాలే కొంటున్నారు అన్న టాక్ ఉంది.
ఇంకా రిపీటెడ్ గా మళ్లీ మళ్లీ సేమ్ సినిమాని వేయడం ఛానల్ కి కొంత ప్రతికూల వాతావరణం తెస్తోందట. ఇప్పుడు చరణ్ సినిమాని జీ-5 సంస్థ శాటిలైట్ హక్కులు దక్కించుకుంది అంటే ఇదే సెంటిమెంట్ సినిమా మీద పనిచేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెగా మేనల్లుడు సాయితేజ్ నటించిన గత రెండు సినిమాలు జీ స్టూడియోస్ రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే .ఈ రెండు సినిమాలు కూడా పెద్ద గా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ కి ఈ సెంటిమెంట్ రిపీటవుతుందా ఏంటో అన్న సందేహం వ్యక్తం అవుతోంది. అయితే సెంటిమెంట్లను కేర్ చేయని అభిమానులు శంకర్ విషయంలో ఎంతో ధీమాతో ఉన్నారు. చరణ్ కెరీర్ బెస్ట్ సినిమాని ఆయన తెరకెక్కిస్తున్నారనే అభిప్రాయం ఉంది. జీ 5 ఇక RC15 తో సెంటిమెంట్ కి చెక్ పెట్టి సరికొత్త చరిత్ర తిరగరాస్తుందనే పలువురు అభిప్రాయపడుతున్నారు.