మెగా హీరో మూవీని 'పే ప‌ర్ వ్యూ' విధానంలో రిలీజ్ చేస్తారా...?

Update: 2020-09-19 15:30 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ మరియు రెండు వీడియో సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి స్టార్ట్ చేసి చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే ఇన్నాళ్లు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేస్తారని అనుకుంటున్న తరుణంలో ఈ మూవీని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కాగా, జీ 5 ఒరిజినల్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి సుమారు రూ.33 కోట్లకు తీసుకుందని ఓటీటీ వర్గాల్లో అనుకుంటున్నారు. అయితే ఇంత భారీ రేట్ పెట్టి మెగా హీరో సినిమాని తీసుకున్నా.. జీ 5 ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎంత మందికి రీచ్ అవుతుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జీ 5 యాప్ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. దానికి ఇక్కడ స‌బ్ స్క్రైబ‌ర్స్ గా కూడా మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ మందే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' సినిమాను లిమిటెడ్ ఆడియెన్స్ మాత్ర‌మే చూస్తారని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో జీ 5 వారు 'సోలో బ్ర‌తుకే..' చిత్రాన్ని ఏటీటీ ప‌ద్ధ‌తిలో పే ప‌ర్ వ్యూ ఫార్మాట్ లో అందుబాటులో తీసుకురాబోతున్నార‌ని స‌మాచారం. ఈ విధంగా జీ 5 యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న వారు ఈ సినిమా వ‌రుకు మాత్రమే డ‌బ్బులు చెల్లించి చూడాల్సి ఉంటుందట. ఇప్పటి వరకు ప్రముఖ ఓటీటీలల్నీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని స‌బ్ స్క్రైబ‌ర్స్ తీసుకున్న వారికి అనేక చిత్రాలు అందుబాటులో ఉంచుతూ వస్తున్నాయి. అయితే జీ 5 వారు మాత్రం సినిమాని కొన్న డబ్బులు వెనక్కి రాబట్టుకోవడానికి ఈ మూవీ వరకు పే ప‌ర్ వ్యూ విధానంతో వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారట. ఇక ఈ సినిమా థియేట‌ర్ రిలీజ్ రైట్స్ కూడా జీ 5 వారికే అనే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో థియేటర్స్ ఓపెన్ చేసాక ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తారేమో చూడాలి. అయితే పాపులర్ యాప్స్ కి కాకుండా జీ 5 వారికి ఇవ్వడం అనేదే తప్పుడు నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News