నా కోసం సృష్టించిన‌ పాత్ర‌లో వేరొక‌రిని ఊహించుకోలేను: స్టార్ హీరో

మానాడులో ఎస్‌జె సూర్య పాత్రను పోషించడానికి అరవింద్ స్వామి మొదటి ఎంపిక.

Update: 2024-09-18 23:30 GMT

2021లో విడుదలైన వెంకట్ ప్రభు చిత్రం 'మానాడు' అభిమానులు, విమర్శకుల నుండి మంచి సమీక్షలను పొందింది. సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో ఎస్.జె సూర్య, కళ్యాణి ప్రియదర్శన్ స‌హా ప్రధాన పాత్రలో సింబు నటించారు. ఈ సినిమా `థీమ్ ఆఫ్ టైమ్ లూప్‌`ని అభిమానులు ప్రశంసించగా, ఎస్‌జె సూర్య నటన అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ర్షించింది. అయితే ఈ పాత్రకు అతడు మొదటి ఎంపిక కానే కాద‌ని తెలిసింది. మానాడులో ఎస్‌జె సూర్య పాత్రను పోషించడానికి అరవింద్ స్వామి మొదటి ఎంపిక.


ప్రముఖ హోస్ట్ గోపీనాథ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు అరవింద్ స్వామి ఆ పాత్రను వదులుకోవడం గురించి స్పష్టంగా చెప్పారు. నేను ఆ సినిమాలో ఎస్‌జె సూర్య పాత్రలో నటించాల్సి ఉంది. డేట్స్ సమస్యల కారణంగా ఒక నెల సమయం అడిగాను. కానీ టీమ్ వేచి ఉండలేకపోయింది. నేను దానిని గౌరవించాను! అని చెప్పాడు. ఆ తర్వాత తన పాత్రలో ఎవరినీ ఊహించుకోలేక సినిమా చూడలేద‌ని చెప్పాడు. నా క్యారెక్టర్‌లో ఇతరులను ఊహించుకోలేకపోయాను కాబట్టి ఇప్పటి వరకు సినిమా చూడలేదు అని స్వామి అన్నారు. దీనిని వెంక‌ట్ ప్ర‌భు కూడా ధృవీక‌రించారు. ''అర‌వింద స్వామి మొద‌టి ఎంపిక‌.. కానీ షూటింగ్ ఆలస్యం, ఇతర సమస్యల కారణంగా అతను చిత్రంలో భాగం కాలేకపోయాడ''ని ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు కూడా అన్నారు. ఆ తర్వాత ఎస్‌జె సూర్యను సంప్రదించాను. అతను పాత్రను బాగా ఆస్వాధించాడు. ఒక గొప్ప దర్శకుడు నా పనితనాన్ని మెచ్చుకోవడం, ఆ తర్వాత ఆయన సినిమాలోకి రావడం చాలా సంతోషకరమైన ఘట్టం అని వెంకట్ ప్రభు అన్నారు.

అరవింద్ స్వామి త్వరలో సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలోని యాక్షన్ డ్రామా 'మేయాజ‌గ‌న్'లో కనిపించనున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్నారు. రాజకిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీరంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్ శక్తి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News