ఈ నటుల భవిష్యత్ నటవారసుడి చేతిలో
బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలో బంధుప్రీతి, నటవారసత్వం గురించి చాలా చర్చ సాగుతోంది. అయితే నటవారసులు రాణిస్తున్నది చాలా తక్కువ.;

బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలో బంధుప్రీతి, నటవారసత్వం గురించి చాలా చర్చ సాగుతోంది. అయితే నటవారసులు రాణిస్తున్నది చాలా తక్కువ. ఇటీవల బాలీవుడ్ లో అమీర్ ఖాన్, సైఫ్ ఖాన్, శ్రీదేవి నట వారసులు వెండితెరకు పరిచయమైనా జనం నిర్ధయగా తిరస్కరించారు. యువతారల తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అయితే పై విభాగంలో కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఖాన్ వారసుడు ఆర్యన్ చాలా తెలివిగా, భిన్నంగా ఆలోచిస్తున్నాడు. అతడు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్టార్ అవ్వాలని కలగనలేదు. ప్రస్తుతం అతడు కెమెరా వెనక కెప్టెన్ అవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలని కలగంటున్నాడు. తొలి ప్రయత్నం ఒక విభిన్నమైన కాన్సెప్టును ఎంచుకుని ప్రయోగం చేస్తున్నాడు. ఇందులో బాబి డియోల్, రాఘవ్ ప్రధాన పాత్రధారులు.
`ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` అనేది సినిమా టైటిల్. ఫిబ్రవరి 2025లో ఈ సినిమాని ప్రకటించారు. ఆసక్తికరంగా బాబీ డియోల్ -రాఘవ్ జుయల్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆ ఇద్దరూ ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారు? అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు. వారు నెగటివ్ పాత్రలు పోషించరని మాత్రం తెలిసింది. యానిమల్ - ఆశ్రమ్ లలో విలన్ పాత్రలు పోషించిన బాబీ, కిల్ లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ అవే పాత్రలను తెరపై రిపీట్ చేయడం లేదు. వారి పాత్రలను ఆర్యన్ ఖాన్ అద్భుతంగా తీర్చిదిద్దారని సమాచారం. బంధుప్రీతితో సంబంధం లేకుండా ఆర్యన్ తన పోరాటం ప్రారంభించాడు. అతడు దర్శకుడు అవ్వాలని భావించడాన్ని అందరూ సమర్థిస్తున్నారు. ది బా*డ్స్ ఆఫ్ బాలీవుడ్‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. అధికారికంగా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. బాబి, రాఘవ్‌ల కెరీర్ జర్నీ కి ఈ సినిమా ఏమేరకు సాయమవుతుందో వేచి చూడాలి.