తనకంటే 8 ఏళ్ల పెద్దదైన లారిస్సాతో ప్రేమలో?
ఇటీవల లారిస్సా ముంబైలో పార్టీల్లో ఎక్కువగా కనిపించడంపైనా రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రెజిల్ నటి కం మోడల్ లారిస్సా బొనేసితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారు జంటగా కలిసి కనిపించిన తర్వాత ఊహాగానాలు చెలరేగాయి. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అనుసరిస్తున్నారు. అయితే మీడియాలో ఎంత హడావుడి జరుగుతున్నా ఆర్యన్ ఖాన్ లేదా లారిస్సా బోనేసి వారి రిలేషన్ షిప్ స్టేటస్‌కు సంబంధించి అధికారికంగా ఏదీ ధృవీకరించలేదు. కనీస వివరణ కూడా ఇవ్వలేదు. ఇటీవల లారిస్సా ముంబైలో పార్టీల్లో ఎక్కువగా కనిపించడంపైనా రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి పార్టీకి వెళుతూ లారిస్సా కెమెరా కంటికి చిక్కింది.
ఆర్యన్ ప్రస్తుతం లారిస్సా, ఆమె కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లోను వారంతా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. అలాగే లారిస్సా బాలీవుడ్ లో కెరీర్ కోసం ఎదురు చూస్తుంటే ఆర్యన్ సహకారం అందనుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఈ జంట ఇప్పటివరకూ ధృవీకరించలేదు.
మరోవైపు తనకంటే చాలా చిన్నవాడైన ఆర్యన్ ఖాన్ తో లారిస్సా ప్రేమలో పడటంపైనా నెటిజనుల్లో గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. లారిస్సా 1990లో జన్మించింది. ఆర్యన్ డి.వో.బి 12-09-1997. దీంతో ఈ ఇద్దరి మధ్యా ఏడేళ్ల గ్యాప్ కనిపిస్తోంది. తనకంటే వయసులో పెద్దది అయిన లారిస్సాను ఆర్యన్ ప్రేమించడంపై ఖాన్ అభిమానుల్లోను చర్చ సాగుతోంది.
లారిస్సా ఇటీవల ముంబైలో ఉంది. ఆర్యన్ సొంత లేబుల్ D'YAVOL రూపంలో లారిస్సా బహుమతిని అందుకుంది. దీంతో వారు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఇంతలోనే ఆర్యన్ తన దర్శకత్వ వెంచర్ గా తొలి సిరీస్ `స్టార్‌డమ్`పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నాడు. ఆర్యన్ 2022లో SLAB అనే లగ్జరీ లైఫ్‌స్టైల్ కలెక్టివ్‌ని ప్రారంభించేందుకు బంటీ సింగ్ - లెటి బ్లాగోవాతో భాగస్వామిగా చేరారు. బ్రాండ్‌లో భాగంగా అతడు D'yavol X అనే ఫ్యాషన్ లైన్‌ను ప్రారంభించాడు.
లారిస్సా బోనెసి 28 మార్చి 1990న బ్రెజిల్‌లో జన్మించింది. ఈ బ్యూటీ కొన్ని హిందీ, తెలుగు చిత్రాలలో నటించింది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం నటించిన `దేశీ బాయ్జ్` పాట `సుబా హోనే నా దే`లో కూడా ఒక నర్తకిగా కనిపించింది. సైఫ్ అలీ ఖాన్ నటించిన `గో గోవా గాన్`లో కూడా ఆమె చిన్న పాత్ర పోషించింది. తెలుగులో సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క చిత్రంలో లారిస్సా కనిపించింది. యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన తిక్క చిత్రంలో ఆమె కథానాయిక. మోడల్‌గా, లారిస్సా ఓలే, లాంకోమ్, లెవీస్ వంటి బ్రాండ్‌ల కోసం ప్రకటనల్లో కనిపించింది.