60వ సినిమాతో దిల్ రాజు మరో ప్రయోగం
ఇప్పుడు అదే స్థాయిలో కొత్త కథనంతో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు ఆశిష్ హీరోగా మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.;

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 60వ సినిమాను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే స్థాయిలో కొత్త కథనంతో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు ఆశిష్ హీరోగా మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే పలు చిత్రాలతో తనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆశిష్‌కి ఇది మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టే అవకాశం. ఈ సినిమాలో అతను పూర్తిగా బోల్డ్, విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రలో కనిపించనున్నాడు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఓ చిన్న తెలంగాణ సంగీత బృందం ఆధారంగా ఈ కథ సాగనుందట. కథలో విలేజ్ నేటివిటి, ఎమోషనల్ థీమ్ ప్రధానంగా ఉంటాయని సమాచారం.
ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ఆదిత్య రావు గంగాసాని పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం కోసం కొత్త నటులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సినిమాకు సంబంధించిన బృందం భారీగా కళాకారుల ఎంపిక ప్రకటనను విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ యాసలో మాట్లాడగలవారిని కోరుతున్నారు. నూతన కళాకారులు వీడియోలు పంపించాలని, మొబైల్ వీడియోలు, స్వీయ చిత్రం ఆధారంగా ఎంపిక చేసేది కాదని స్పష్టంగా తెలిపారు. ఇది నటనకు ప్రాముఖ్యత ఇచ్చే మంచి ఆరంభంగా భావించవచ్చు.
దర్శకుడు ఆదిత్య రావు ఇప్పటివరకు కొన్ని చిన్నపాటి కథలకు రచయితగా పని చేశాడు. ఇప్పుడు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ద్వారా తన దర్శకత్వ పయనాన్ని ప్రారంభించనున్నాడు. కొత్త దర్శకులకు అవకాశమిచ్చే విషయంలో దిల్ రాజు ముందుండటం ఇప్పటివరకు మనం చూశాం. అదే విధంగా ఈ సినిమాలో కూడా నూతన ఆర్టిస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ సంగీత బృందం నేపథ్యంగా ఉండే ఈ కథలో యువత జీవితం, వారి కలలు హైలెట్ కానున్నాయట. భావోద్వేగంతో పాటు, నిజ జీవితంలోని సంఘటనలకు సమాంతరంగా సాగే విధంగా ఈ చిత్రం రూపొందనుందట. ఉత్కంఠను కలిగించే విధంగా కథని తీర్చిదిద్దేందుకు చిత్రబృందం శ్రమిస్తోందని తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రం యువతకు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుందని భావిస్తున్నారు. ఆశిష్‌కి ఇది ఓ బిగ్ బ్రేక్ కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక త్వరలొనే మరిన్ని అప్డేట్స్ అంధించనున్నారు.