అషు రెడ్డి… ట్రెండీ డ్రెస్సులో హీటెక్కించేలా..
ఇదిలా ఉంటే ఆషు రెడ్డి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ కలర్ నెట్ టాప్ వేసుకొని అదిరిపోయే లుక్స్ తో ఉన్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అందాల ఆషు రెడ్డి సోషల్ మీడియాలో గత కొంతకాలంగా విపరీతంగా వైరల్ అవుతోంది. రెగ్యులర్ గా ఈ బ్యూటీ తన గ్లామర్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ గ్లామర్ ఫోటో షూట్ లు బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. కొత్త కొత్త అవుట్ ఫిట్ లతో అటు మోడ్రన్, ఇటు ట్రెడిషన్ ని కలిపేసి ఆషు రెడ్డి ఫోటోషూట్ లతో కలర్ ఫుల్ గా కనిపిస్తూ వస్తోంది.
హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో మెరిసిపోతుంది. సోషల్ మీడియాలో జూనియర్ సమంత అనే బ్రాండ్ తో అందరికి చేరువ అయిన ఆషు రెడ్డి తరువాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి బాగా పాపులర్ అయ్యింది. ఆరంభంలో బొద్దుగా ఉండే ఈ అమ్మడు తరువాత ఫిట్ నెస్ పైన ఫోకస్ చేసి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది.
జూనియర్ సమంత అనే ఇమేజ్ కి దూరంగా వచ్చి ఆషు రెడ్డిగానే తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఇదే బ్రాండ్ తో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేస్తోంది. ఈమె ఫోటోలని లక్షల్లో నెటిజన్లు రెగ్యులర్ గా వీక్షిస్తున్నారు. ట్విట్టర్ లో కూడా ఆషు రెడ్డి గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఆషు రెడ్డి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ కలర్ నెట్ టాప్ వేసుకొని అదిరిపోయే లుక్స్ తో ఉన్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఈ ఫోటోలలో ఆషు చాలా గ్లామర్ గా కనిపిస్తోంది. ఫోటోలకి ఆమె అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. నాకు ఎలాంటి స్టైలిష్ అవసరం లేదు. ఎందుకంటే నేనే ఒక స్టైల్ అంటూ మెన్షన్ చేసింది. ఆమె కాన్ఫిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఈ ఫోటోలు వాటికి ఆమె పెట్టిన క్యాప్షన్ ఉండటం విశేషం. ఇదే లుక్ ని మెయింటేన్ చేస్తే కచ్చితంగా టాలీవుడ్ లో ఆషు రెడ్డికి నటిగా అవకాశాలు పెరగడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు.