అషు రెడ్డి.. నా బాడీ సూపర్ డీలక్స్!!
ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా ఉంటూ సీజన్ లో హైలైట్ అయింది. టైటిల్ గెలవక పోయినా.. ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.
తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తో అషు రెడ్డి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వాడకం ఎక్కువగా లేని సమయంలో డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషు.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తన అందచందాలు, ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా ఉంటూ సీజన్ లో హైలైట్ అయింది. టైటిల్ గెలవక పోయినా.. ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది అషు రెడ్డి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అల్లాడిస్తోంది. రీల్స్, ఫొటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటోంది. ట్రెడిషనల్ తో పాటు సెగలు పుట్టించే డ్రెస్సుల్లో కూడా స్కిన్ షో చేస్తోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి సందడి చేస్తుంటోంది. మరోవైపు నటిగా కూడా ప్రూవ్ చేసుకుంటోంది. ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
ఛల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, ఫోకస్ వంటి సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అషు రెడ్డి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. 'పద్మవ్యూహంలో చక్రధారి' అనే సినిమాలో పద్మ అనే పాత్ర పోషిస్తోంది అషు. ప్రేమ పేరుతో యువత ఎలా తప్పుదోవ పడుతున్నారు? ఎలాంటి అనర్ధాలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని వివరించే పాత్రలో ఆమె కనిపించబోతోందని అర్థమవుతోంది.
ఈ సినిమాతో పాటు హీరోయిన్ చాందినీ చౌదరి ఎస్సై గా లీడ్ రోల్ చేస్తున్న 'యేవమ్' చిత్రంలో కూడా నటిస్తోంది అషు. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో హారిక పాత్ర చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి అషు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అందులో అషు బ్లాక్ బ్లౌజ్, రెడ్ కలర్ బాటమ్ తో ఓ రేంజ్ లో ఉంది. కుర్చీలో కూర్చుని అదిరిపోయే పోజు ఇచ్చింది. 'నా బాడీ సూపర్ డీలక్స్' అంటూ పోస్టర్ పై రైటప్ ఇచ్చారు యేవమ్ మేకర్స్.
అయితే ఈ సినిమాలో అషు రెడ్డి కాస్త బోల్డ్ గానే కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం అషు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. నెటిజన్లు అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అషు విభిన్న కథాంశాలు, పాత్రలతో టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. ఇక యేవమ్ మూవీ కొత్త కంటెంట్, డిఫరెంట్ నరేషన్ తో ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ మూవీతో అషు హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.