'కల్కి 2'లో ఉండేది వాళ్లే.. అశ్వినీదత్ సూపర్‌ అప్‌డేట్‌

తాజాగా సీక్వెల్‌ గురించి నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి సీక్వెల్‌ రిలీజ్ గురించి షూటింగ్‌ గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

Update: 2025-01-15 11:34 GMT

ప్రభాస్‌తో కలిసి నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరించిన అద్భుత ఫ్యూచర్‌ విజువల్‌ వండర్‌ 'కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. హాలీవుడ్‌లోనూ కల్కి సినిమా సర్‌ప్రైజింగ్‌గా నిలిచింది. విదేశాల్లోనూ కల్కి జోరు కంటిన్యూ అవుతుంది. ముందు ముందు మరిన్ని దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కలియుగం అంతం అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఫ్యూచర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మనం చేసే తప్పులు మన భవిష్యత్తు తరాల వారికి మనుగడ లేకుండా చేయబోతుంది అంటూ ఒక మంచి మెసేజ్‌ను సైతం ఇచ్చాడు.

ఫ్యూచర్‌లో జరగబోతున్న విధ్వంసంకి మహాభారత పాత్రలను కలిపి దర్శకుడు నాగ్‌ అశ్విన్ చూపించిన కల్కి సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కల్కి సినిమా కథ మధ్యలో ఆగిపోయింది. మొదటి పార్ట్‌ చివర్లో కథను సస్పెన్స్‌తో ముగించారు. దీపికా పదుకనేను తీసుకు వెళ్లడంతో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది సెకండ్‌ పార్ట్‌లో చూపించబోతున్నారు. తాజాగా సీక్వెల్‌ గురించి నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి సీక్వెల్‌ రిలీజ్ గురించి షూటింగ్‌ గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

కల్కి 2 సినిమా షూటింగ్‌ ఈ ఏప్రిల్‌లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీగా ఉందని పేర్కొన్నాడు. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. సినిమాలోని కథను మరింత డెప్త్‌గా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఫస్ట్‌ పార్ట్‌లో కమల్‌ హాసన్‌ ఉన్నాడా లేదా అనే అనుమానాలు కలిగే విధంగా ఆయన పాత్ర ఉంది. కానీ సెకండ్‌ పార్ట్‌లో ఆయన కచ్చితంగా పెద్ద పాత్రలో కనిపించబోతున్నాడని అశ్వినీదత్‌ ఆయన అభిమానులకు హామీ ఇచ్చాడు.

సెకండ్‌ పార్ట్‌లో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌ కాంబో సన్నివేశాలు ఉంటాయని పేర్కొన్నాడు. అంతే కాకుండా అమితాబ్‌ బచ్చన్‌ సైతం సినిమాలో మరింత కీలకంగా కనిపించబోతున్నారు అన్నారు. సెకండ్‌ పార్ట్‌ కథ మెయిన్‌గా ప్రభాస్‌, అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌ పాత్రలపై నడుస్తుందని అన్నారు. అంతే కాకుండా సినిమాలోని కీలక సన్నివేశాల్లో దీపికా పదుకునే సైతం ఉంటారని అన్నారు. సెకండ్‌ పార్ట్‌లో కొత్త నటీనటులు కనిపించబోతున్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ నాగ్‌ అశ్విన్‌ స్క్రిప్ట్‌ అనుసారంగా అవసరం అయితే తీసుకుంటాడని పేర్కొన్నారు.

Tags:    

Similar News