ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత ఫస్ట్ టైమ్ ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్..!
ఇప్పుడు అతియా తన భర్త ఆడబోతున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను చూడటం కోసం పెర్త్‌కి వెళ్లింది.
టీం ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులు ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట ఎక్కువ కాలం గ్యాప్ తీసుకోకుండా అప్పుడే తల్లిదండ్రులు కాబోతున్నారు. రాహుల్ తో పాటు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అతియా శెట్టి మీడియా కంట పడటం లేదు, ఆమె గర్భవతి కావడంతో పూర్తి విశ్రాంతి మోడ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అతియా తన భర్త ఆడబోతున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను చూడటం కోసం పెర్త్‌కి వెళ్లింది.
అతియా శెట్టి ఫోటో గ్రాఫర్ల ఫోటోలకు దూరంగా ఉండటం కోసం, కెమెరాల రేడియేషన్‌కి దూరంగా మరో మార్గం ద్వారా ఎయిర్‌పోర్ట్ లోనికి వెళ్లింది. లోనికి వెళ్లి చెకిన్ వద్ద అతియా శెట్టి కొన్ని సెకన్లు వెయిట్ చేసింది. అంతలోనే అతియా శెట్టిని అక్కడ ఉన్నవారు పోటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయాణాలు మంచిది కాదని తెలిసినా భర్త ఆడబోతున్న కీలక సిరీస్ కావడంతో అతియా శెట్టి పెర్త్ కి వెళ్లాలని ఫిక్స్ అయిందని ఆమె సన్నిహితులు మరియు మీడియా వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి అతియా శెట్టి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో మీడియా వారు తమ పని చేశారు.
ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత అతియా శెట్టి మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై ఉంది. కెమెరాల్లో ఆమెను బంధించకున్నా, దూరంగా ఉండి తీసిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అతియా శెట్టి బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అనే విషయం తెల్సిందే. దాదాపు పదేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం సాగిందని, పెద్దలు మాట్లాడుకుని పెళ్లి కుదిర్చి వీరికి గత ఏడాదిలోనే వివాహం చేయడం జరిగింది. ఏడాదిలోనే వీరు తల్లిదండ్రులు కావాలని కోరుకోవడం, వీరికి పిల్లలపై ఉన్న ప్రేమను చూపకనే చూపుతోంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల క్రితం పంచోలీ సినిమాతో అతియా శెట్టి బాలీవుడ్‌లో నటిగా కెరీర్‌ను ఆరంభించింది. ఆ సినిమాలో సూరజ్ హీరోగా నటించాడు. మొదటి సినిమా నిరాశ పరచినా స్టార్ కిడ్ కావడంతో ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు రాలేదు. దాంతో ఆఫర్లు సైతం చాలా తక్కువ అయ్యాయి. చిన్న ప్రాజెక్ట్‌ల్లో నటించడం ఇష్టం లేక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్న అతియా శెట్టి ముందు ముందు సినిమాల్లో ఆఫర్లు వస్తే నటించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.