బిగ్‌బాస్ : నటి పై దాడి, తీవ్ర గాయాలు

ప్రదీప్ గురించి మాట్లాడినందుకు ఆయన అభిమానులు ఇలా భౌతిక దాడులు చేశారు అంటూ తాను గాయ పడ్డ ఫోటోను షేర్‌ చేయడంతో పాటు.

Update: 2023-11-26 06:48 GMT
బిగ్‌బాస్ : నటి పై దాడి, తీవ్ర గాయాలు
  • whatsapp icon

బిగ్ బాస్‌ షో జరుగుతున్న ప్రతి సారి ఏదో ఒక వివాదం తమిళనాట జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ 7 కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆ షో లో కంటెస్టెంట్స్ గా ఉన్న జోవిక మరియు ప్రదీప్‌ ల మధ్య హోరా హోరీ ఫైటింగ్‌ ఆటల్లో మరియు నామినేషన్స్ సమయంలో జరుగుతోంది. వారి ఫ్యాన్స్ కూడా బయట అదే రేంజ్ లో గొడవ పడుతున్నారు.

జోవిక మరెవ్వరో కాదు... కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన వనిత విజయ్ కుమార్‌ కుమార్తె. ఈమెకు అంత పెద్ద కుమార్తె ఉందా అని చాలా మంది ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియా ద్వారా దక్కిన పాపులారిటీతో జోవిక బిగ్ బాగ్ హౌస్ లో అడుగు పెట్టింది.

బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన అనుభవం ఉన్న వనిత విజయ్ కుమార్‌ తన కూతురు కోసం బయట రివ్యూలు చేస్తూ, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ తన కూతురు కి మద్దతుగా నిలుస్తూ ఉంది. హౌస్‌ లో జోవిక తో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే ప్రదీప్ పై కూడా వనిత విజయ్ కుమార్‌ విమర్శలు చేయడం జరుగుతూ ఉంది.

ప్రదీప్ పై వనిత చేస్తున్న విమర్శలు సోషల్‌ మీడియాలో వివాదాస్పందం అవుతున్నాయి. ప్రదీప్ అభిమానులు రెగ్యులర్ గా వనిత పై సోషల్‌ మీడియా ద్వారా విమర్శల దాడి చేయడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ దాడి మరింత ఎక్కువ అయింది. ఏకంగా భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు అంటూ ప్రదీప్‌ అభిమానుల పై వనిత సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది.

ప్రదీప్ గురించి మాట్లాడినందుకు ఆయన అభిమానులు ఇలా భౌతిక దాడులు చేశారు అంటూ తాను గాయ పడ్డ ఫోటోను షేర్‌ చేయడంతో పాటు, వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు ఇస్తానంటూ హెచ్చరించింది.

తన కూతురు జోవిక కు మద్దతు ఇచ్చుకుంటే పర్వాలేదు కానీ ప్రదీప్‌ పై విమర్శలు చేయడం ఏంటి అంటూ ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అసహనం ఉన్నా కూడా మాటలతో సమాధానం చెప్పాలి అంతే కాని ఇలా భౌతిక దాడులు ఏంటి అంటూ కొందరు ప్రదీప్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News