మా డాడీ మెగాస్టార్.. అందుకే నాకు అలా!: యాటిట్యూడ్ స్టార్
అయితే మూవీ లాంచింగ్ ఈవెంట్ లో తన మాట తీరుతో చంద్రహాస్.. యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. రామ్ నగర్ బన్నీ టైటిల్ తో డెబ్యూ మూవీ చేస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ రిలీజ్ తర్వాత.. తుఫాను, వరద బాధితులకు తన వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు చంద్రహాస్.
అయితే మూవీ లాంచింగ్ ఈవెంట్ లో తన మాట తీరుతో చంద్రహాస్.. యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయనపై తెగ ట్రోల్స్, మీమ్స్ కనిపించాయి. ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో తనపై వస్తున్న ట్రోల్స్‌పై చంద్రహాస్ స్పందించారు. సినిమా లాంఛింగ్ రోజు తాను చేతులు జేబులో పెట్టుకొని క్యాజువల్ గా నిల్చున్నానని తెలిపారు. అది చూసి తనను చాలా మంది ట్రోల్ చేశారని చెప్పారు.
"మా నాన్న బుల్లితెర మెగాస్టార్.. స్మాల్ స్క్రీన్ మెగాస్టార్.. డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్.. వేల ఎపిసోడ్ల సీరియల్స్ లో ఆయన యాక్ట్ చేశారు.. నటనే కాదు.. ఎన్నో షోలకు హోస్ట్ చేశారు.. ఆయన చేయనిదేం లేదు.. అందుకే నాకు యాటిట్యూడ్ ఉంటుంది.. ఎందుకు ఉండదు.. ఎందుకంటే మా నాన్న హీరో.. నాకు అవమానించారని మీరు అనుకుంటున్నారు.. యాటిట్యూడ్ స్టార్ అని మీరు అంటే నాకు ప్రైడ్.. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది" అని అన్నారు.
"నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతాను.. నా రామ్ నగర్ బన్నీ మూవీ తర్వాత నెగిటివ్ గా నా కోసం అన్నవారు.. పాజిటివ్ గా మారుతారు.. 100 శాతం కాకపోయినా 60 శాతం మందికి నచ్చుతా.. త్వరలో అందరినీ మార్చేస్తా.. ఎంటర్టైన్ చేయడమే నా గోల్.. అందరినీ హ్యాపీ చేయడం నా గోల్.. లోకంలో నెగిటివిటీ, పాజిటివిటీ ఉంటాయి. ఇంట్లో ఏం చేయకుండా మీరు ఉంటే మీ అమ్మ నాన్న చాలా అంటారు.. దున్నపోతు అంటూ చాలా తిడతారు" అని తెలిపారు.
"అదే ఇంట్లో హెల్ప్ చేస్తే చాలా పొగుడుతుంటారు.. బంగారం అంటారు.. బయట కూడా చెప్పుకుంటారు.. నచ్చే పని చేస్తే పొగుడుతారు.. నచ్చని పని చేస్తే తిడతారు.. మూవీ పరంగా మీకు నచ్చేలా చేస్తాను.. నాపై అనేక మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.. జోకర్ అన్నారు.. నాలాంటోడే హిట్ కొడితే.. నెగిటివిటీ పాజిటివిటీ చేస్తే.. ఆ సత్తా అందరికీ ఉన్నట్లే. సినిమా స్టార్టింగ్ లో నా పేరు ముందు యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ వస్తుంది. అంతా చప్పట్లు కొట్టాలి.. అప్పుడు నెగిటివ్ మాటలు అన్న వాళ్లకు మైండ్ పోవాలి.. అదే నా కోరిక" అని చంద్రహాస్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.