`అవ‌తార్-3` రిలీజ్ తేదీ వ‌చ్చేసింది!

జేమ్స్ కామోరాన్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ -3 కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-10 06:51 GMT

జేమ్స్ కామోరాన్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ -3 కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. అవ‌తార్ రెండు భాగాలు భారీ విజ‌యం సాధించ‌డంతో మూడ‌వ భాగం కోసం వ‌ర‌ల్డ్ అంతా ఎంతో ఎగ్జైట్ మెంట్తో ఎదురు చూస్తోంది. ఎప్పుడొస్తుందా? అని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరిగిపోతుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా `అవ‌తార్ -3` రిలీజ్ తేదిని అధికారికంగా ప్ర‌కటించారు. 2025 డిసెంబ‌ర్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అంటే మ‌రో ఏడాదికి పై గా స‌మ‌యం ఉంది.

ఇక థ‌ర్డ్ పార్ట్ అగ్ని కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని తెర‌కెక్కించిన‌ట్లు రివీల్ చేసారు. పంచ‌భూతాల్లో అగ్ని మూడ‌వ‌ది. ఇప్పుడు అవ‌తార్ మూడ‌వ భాగం కాబ‌ట్టి ఆ కాన్సెప్ట్ కిముడి పెట్టారు. మొద‌టి భాగం భూమండ‌ల‌పై తెర‌కెక్కించ‌గా, రెండ‌వ భాగాన్నిపూర్తిగా స‌ముద్ర గ‌ర్భంలో హైలైట్ చేసారు. మొద‌టి భాగం పండోరా గ్ర‌హంపై...రెండ‌వ భాగాన్ని ది వేఆఫ్ వాట‌ర్ బేస్ ని ఆధారంగా తీసుకుని రిలీజ్ చేసారు. పంచ భూతాల్లో ఇదో ఆర్డ‌ర్ అన్న‌ది తెలిసిందే. ఫైర్ అండ్ య‌ష్ స‌బ్ టైటిల్తో దీన్నీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇక `అవ‌తార్ -4` రిలీజ్ కి సంబంధించి గ‌తంలోనే ప్ర‌క‌ట‌నిచ్చారు. `అవ‌తార్ -4` 2026 డిసెంబ‌ర్ లో రిలీజ్ కానుంది. అలాగే అవ‌తార్ చివ‌రి భాగం `అవ‌తార్ -5` 2028 డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు. దీంతో అవ‌తార్ ప్రాంచైజీ పూర్త‌వుతుంది. షూటింగ్ మాత్రం కంటున్యూటీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం జేమ్స్ కామెరూన్ `అవ‌తార్ -3` ప‌నుల్లో నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది.

`అవ‌తార్` ప్రాంచైజీలు అన్నింటిని కూడా డిసెంబ‌ర్ లోనే రిలీజ్ అయ్యేలా ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక్కో భాగం రిలీజ్ కి రెండేళ్లు చొప్పున గ్యాప్ తీసుకుంటున్నారు. ఇందులో అవ‌తార్ లో న‌టించిన న‌టీన‌టుల‌తో పాటు కొత్త వాళ్లు భాగ‌మ‌వుతున్నారు.

Tags:    

Similar News