అవికా గోర్ పెళ్లికి వ‌య‌సు అడ్డు చెబుతోందా?

అవికాగోర్- మిలంద్ అద్వానీతో ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి ఏడాది అవుతుంది

Update: 2024-07-22 12:10 GMT

అవికాగోర్- మిలంద్ చాంద్వానితో ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి ఏడాది అవుతుంది. స్టిల్ ఇంకా ల‌వ్ లోనే ఉన్నారు. పెళ్లి అనే టాపిక్ ఇంకా రాకుండా ఇద్ద‌రు ల‌వ్ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. అయితే నెట్టింట ఇద్ద‌రు పెద్ద‌గా ప్ర‌చారం కోరుకునే ప్రేమికులు కాదు. ఏం చేసినా అంతా కామ్ గా ఉండాలి అన్న టైప్. వెకేష‌న్ల‌కు వెళ్లినా...క‌లిసి కాపీలు..టీలు తాగినా ఆ ఫోటోలు ఎక్క‌డా లీక్ అవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటారు.

ఒక‌వేళ లీక్ అయ్యాయి? అంటే అవి అధికారికంగా వ‌చ్చినవి అన్న‌ట్లే లెక్క‌. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు మ‌రోసారి ల‌వ్ స్టోరీ గురించి ఇలా చెప్పుకొచ్చింది. `కామ‌న్ ప్రెండ్ ద్వారా మిలంద్ ప‌రిచ‌మయ్యాడు. ఆరు నెల‌ల పాటు స్నేహంగా ఉన్నాం. తొలి ప్ర‌పోజ‌ల్ అత‌డి నుంచే వ‌చ్చింది. నా అభిప్రాయాల్ని అత‌డు గౌర‌వించిన విధానం ఎంతో న‌చ్చింది. అందుకే అత‌డి ప్ర‌తిపాద‌న‌కి ఒకే చెప్పా. మా మ‌న‌సులు క‌లిసాయి. నా దృష్టిలో మాన‌సికంగా మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.

పెళ్లి గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. వ‌య‌సు రీత్యా చాలా వ్య‌త్యాసం ఉంది. పెళ్లి అనేది జీవితంలో ముఖ్య‌మైన విష‌యం కాబ‌ట్టి అన్ని విష‌యాలు ఆలోచించి తీసుకోమ‌ని చెప్పాడు. అందుకే ఆ విష‌యం గురించి ఆలోచిస్తున్నా` అని తెలిపింది. మ‌న‌సులు క‌లిసినా పెళ్లి విష‌యంలో వ‌య‌సు వ్య‌త్యాసం ఉండ‌టంతో అవికా ఆలోచ‌న‌లో ప‌డినట్లు తెలుస్తోంది. మ‌రి తుదిగా అవికాగోర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందన్న‌ది చూడాలి.

ఇక అవికా కెరీర్ ఎలా సాగుతుంద‌న్న‌ది తెలిసిందే. కొంత కాలంగా పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. చేసిన సినిమాలేవి స‌రైన ఫ‌లితాలు సాధించ‌డం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ బ్ల‌డ్ ఇష్క్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతానికి చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇది. గ‌త ఏడాది మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News