అవికా గోర్.. అల్ట్రా గ్లామర్ మామూలుగా లేదు

లాంగ్ ఫ్రాక్ లో స్టైలిష్ గా ఫోజులిస్తూ తనలో ఉన్న యాటిట్యూడ్ ని ఈ ఫొటోలతో ఎలివేట్ చేస్తోంది.

Update: 2024-08-20 05:04 GMT

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయిన బ్యూటీ అవికా గోర్. ఈ అమ్మడు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. మొదటి సినిమానే సూపర్ హిట్ అయ్యింది. తరువాత నాగ శౌర్యకి జోడీగా లక్ష్మి రావే మా ఇంటికి మూవీ చేసింది. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. మళ్ళీ రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్త మావ మూవీలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 

అక్కడి నుంచిఅ అవికా గోర్ కి అవకాశాలు పెరిగాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషలలో కూడా అవికా గోర్ అవకాశాలు అందుకుంది. నిఖిల్ కి జోడీగా ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో మరో హిట్ ని అవికా గోర్ తన ఖాతాలో వేసుకుంది. తరువాత తెలుగుకి కొంత గ్యాప్ ఇచ్చింది. మరల స్లిమ్ అయ్యి రాజుగారి గది2తో సూపర్ హిట్ అందుకుంది. ఆ తరువాత అవికా గోర్ చేసిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

 

చివరిగా తెలుగులో ఉమాపతి అనే సినిమాలో అవికా గోర్ కనిపించింది. హిందీలో బ్లడీ ఇష్క్ అనే మూవీతో రీసెంట్ గా అవికా గోర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హర్రర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే బాలీవుడ్ లోనే ప్రస్తుతం అవికా గోర్ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది. దీనికోసం తనని తాను గ్లామర్ గా షోకేస్ చేసుకుంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

 

తాజాగా మరోసారి అదిరిపోయే అందంతో మెస్మరైజ్ చేసే లుక్స్ తో హాట్ ఫోటోలని అవికా గోర్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. లాంగ్ ఫ్రాక్ లో స్టైలిష్ గా ఫోజులిస్తూ తనలో ఉన్న యాటిట్యూడ్ ని ఈ ఫొటోలతో ఎలివేట్ చేస్తోంది. ఈ ఫోటోలకి అవికా గోర్ ఇంటరెస్టింగ్ కామెంట్ కూడా జోడించింది. గుండెలు బద్దలయ్యే విషయం ఒకటైతే. ఇందులో నా ఇగో ఇంకోటి కూడా ఉందంటూ పేర్కొంది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నుంచి అవికా గోర్ యాటిట్యూడ్ పిక్స్ పై అదిరిపోయే కామెంట్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News