బిగ్ బాస్ 8 : అవినాష్.. రోహిణి.. మరోసారి అదరగొట్టేశారు..!

దాదాపు హౌస్ అంతా కూడా వారి కామెడీకి సూపర్ గా ఎంజాయ్ చేశారు.

Update: 2024-11-01 05:54 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చిన అవినాష్ రోహిణిలు తమ మార్క్ ఎంటర్టైనింగ్ చేస్తూ అలరిస్తున్నారు. ఓ పక్క టాస్కుల్లో తమ బెస్ట్ ఇస్తూనే అవసరమైన టైం లో వారు తమ కామెడీతో మెప్పిస్తున్నారు. ఐతే ఈసారి కిచెన్ ని టైమింగ్ తో వాడుకోవాలని కండీషన్ పెట్టాడు బిగ్ బాస్. కేవలం రెండు క్లాన్స్ కలిపి రోజుకి 12 గంటల కిచెన్ టైం వాడుకోవాల్సి ఉంటుంది. ఐతే గురువారం వంట సిద్ధం చేస్తున్న టైం లోనే కిచెన్ టైం అయిపోయింది. అంటే జీరోకి వచ్చే సరికి స్టౌవ్ ఆఫ్ అయ్యింది.

ఐతే బిగ్ బాస్ కిచెన్ టైం ముగిసింది కాబట్టే స్టౌవ్ ఆఫ్ అయ్యిందని చెప్పాడు. ఐతే కిచెన్ టైం పెంచాలంటే అవినాష్, రోహిణి చిన్నపిల్లల్లా మారి ఎంటర్టైన్ చేయాలని అన్నాడు. అలా బిగ్ బాస్ చెప్పాడో లేదో అవినాష్, రోహిణి చిన్నపిల్లల్లా మారి ఎంటర్టైన్ చేస్తున్నారు. దాదాపు హౌస్ అంతా కూడా వారి కామెడీకి సూపర్ గా ఎంజాయ్ చేశారు. హౌస్ మెట్స్ కూడా అవినాష్, రోహిణిలకు సపోర్ట్ చేస్తూ మెప్పించారు.

ఇదివరకు ఏ సీజన్ లో లేని కిచెన్ టైమింగ్ ను ఈ సీజన్ లో పెట్టడమే కాదు అవినాష్, రోహిణిల టాలెంట్ ని చూపించేలా బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడు. ప్రతిసారి కిచెన్ టైం కావాలన్నప్పుడు అవినాష్ తో కామెడీ చేయించడం జరుగుతుంది. సో హౌస్ మెట్స్ కడుపునిండా తినేందుకు అవినాష్ రోహిణిలు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు.

ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్ ముగియగా బ్లూ టీం లో ఉన్న ముగ్గురు మెగా చీఫ్ కంటెండర్స్ గా మారగా గ్రీన్ టీం నుంచి నబీల్, తేజ రెడ్ టీం నుంచి ప్రేరణ మెగా చీఫ్ చివరి పోటీలో నిలిచారు. ఇక తిరుగుతూనే ఉండి గెలిచే వరకు టాస్క్ లో వారికి ఇచ్చిన బస్తాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ టైం లో ఫస్ట్ రౌండ్ లో హరితేజ, రెండో రౌండ్ లో తేజ బయటకు వెళ్లారు. థర్డ్ రౌండ్ లో ప్రేరణ ఆతర్వాత నిఖిల్ బయటకు వెళ్లారు.

ఈ టాస్క్ లో తేజ చాలాసార్లు కింద పడ్డాడు. టాస్క్ నుంచి తప్పుకున్నాక ఏడుస్తూ తనకు ఇంకాస్త స్టామినా ఉంటే బాగుండేదని అన్నాడు. ఇక ఫైనల్ గా ఈ టాస్క్ లో చివరి దాకా ఉండి అవినాష్ ఈ వారం మెగా చీఫ్ అయ్యాడు. అవినాష్ మెగా చీఫ్ అవ్వడం హౌస్ అందరికీ ఆమోదయోగ్యంగానే అనిపించింది.

Tags:    

Similar News