గుండు తో న్యూ లుక్ అదిరింది బాస్!
లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. క్లీన్ హెడ్.. ప్రెంచ్ స్టైల్ గడ్డం లుక్ లో సత్యరాజ్ ని ఓ రేంజ్ లో హైలైట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది.
దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్- నటుడు సత్యరాజ్ కలిసి లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న 'కూలీ' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. రజనీ సహా సత్యారాజ్ కీలక పాత్రలంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో తాజాగా సత్యరాజ్ కొత్త స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఈ పిక్ కూలీ సత్యరాజ్ న్యూలుక్ అంటూ నెట్టిం చర్చ మొదలైంది.
లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. క్లీన్ హెడ్.. ప్రెంచ్ స్టైల్ గడ్డం లుక్ లో సత్యరాజ్ ని ఓ రేంజ్ లో హైలైట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. కళ్లకు కూలింగ్ గ్లాసెస్ దరించాడు. మెడలో పులిగోరుతో కూడిన చైన్... పింక్ కలర్ షర్ట్ పై తళతళలాడిపోతుంది. అలాగే చేతికి బంగారు కడియం చూడొచ్చు. మునుపెన్నడు సత్యరాజ్ ఇలాంటి లుక్ లో కనిపించలేదు. లొకేష్ డిజైన్ చేసిన క్యారెక్టర్ కావడంతో లుక్ అదిరిపోయి దంటూ కామెంట్లు పడుతున్నాయి.
అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ధృవీకరించాల్సి ఉంది. అది కూలీలో సత్యరాజ్ లు కా? లేక ప్రయివేట్ పిక్? అన్నది తెలియాలి. అలాగే ఈ సినిమాలో సత్యరాజ్ పాత్రపై ఆసక్తి రెట్టింపు అవుతుంది. 40 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో మరింత ఆసక్తికరంగానూ మారింది. 40 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య వైరం కారణంగానే సత్యరాజ్ మళ్లీ రజనీకాంత్ సినిమాలో నటించలేదని చాలా కాలంగా ఉన్న వాదన.
'శివాజీ' సినిమాలో సుమన్ పాత్ర ఆఫర్ ముందుగా సత్యరాజ్ కి రాగా ఆయన తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ఆ తిరస్కరణకు కారణం సత్యరాజ్ తన సినిమా పట్ల తమిళులు చూపించిన వివక్ష కారణంగా చెబుతుంటారు. కర్ణాటకకు చెందిన రజనీకాంత్ సినిమాకి ఈవెంట్ అనుమతిచ్చి...తన సినిమా విషయంలో వివక్ష చూపించారంటూ అప్పట్లో సత్యరాజ్ ఆరోపించారు. అలా రజనీ-సత్యరాజ్ మధ్య దూరం పెరిగింది. మళ్లీ ఇంత కాలానికి ఒక్కటిగా కలిసి పనిచేస్తున్నారు. 1987లో ప్రఖ్యాత కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'మనతిల్ ఉరుధి వేండుమ్' అనే చిత్రంలో రజనీ-సత్యరాజ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.