ఇద్దరు ముద్దుగుమ్మలూ కాపాడలేక పోయారు
తమిళ హిట్ సిరీస్ అరణ్మయి ప్రాంచైజీలో రూపొందిన అరణ్మయి 4 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ హిట్ సిరీస్ అరణ్మయి ప్రాంచైజీలో రూపొందిన అరణ్మయి 4 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరణ్మయి సిరీస్ సినిమాలన్నీ కూడా తెలుగు లో డబ్ అవుతున్నాయి. కొన్నింటికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు ఈ సినిమాను కూడా బాక్ పేరుతో డబ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.
పెద్ద సినిమాల నుంచి పోటీ లేకున్నా కూడా చిన్న సినిమాలు చాలానే రావడంతో ఓపెనింగ్ ఎక్కువ రాలేదు. సరే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఆ తర్వాత మంచి వసూళ్లు నమోదు అవుతాయని భావించిన మేకర్స్ కు పెద్ద షాక్ తగిలినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా మరియు రాశి ఖన్నాలు బాక్ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగానే నిర్వహించారు. అయినా కూడా పెద్దగా పలితం దక్కలేదు.
బాక్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మినిమం ఓపెనింగ్స్ కూడా నమోదు అవ్వలేదు. విడుదల తర్వాత అయినా బాక్సాఫీస్ వద్ద సందడి కనిపిస్తుందని మేకర్స్ భావించారు. కానీ అడ్వాన్స్ బుకింగ్ కాలేదు, ఆ తర్వాత బుకింగ్ కూడా అవ్వడం లేదు.
తమన్నా మరియు రాశి ఖన్నాలు ఇద్దరు సినిమాలో ఉన్నా కూడా జనాలు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. హీరోగా నటించిన సుందర్ సి కి తెలుగు లో పెద్దగా బజ్ లేదు. ఆయన నటించడం వల్ల కొందరు సినిమాకు దూరంగా ఉంటే, మరి కొందరు ఇలాంటి మూస తరహా హర్రర్ కామెడీ చూసి బోర్ కొట్టింది అంటున్నారు.
తమిళంలో ఈ సినిమా ఫలితం విషయంలో ఈ వీకెండ్ వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వారం విడుదల అయిన తెలుగు సినిమాల్లో కూడా ఏ ఒక్కటి పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేక పోతున్నాయి. దాంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద వెలవెల ఉండే అవకాశం ఉంది.