ఫ్రీ ఫ్రీ... ఓటీటీలో సూపర్ హిట్ రీమేక్!
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్ హీరోగా నటించగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. కీర్తి సురేష్‌కి ఇది మొదటి హిందీ సినిమా కావడంతో అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల అంచనాలు భారీగా పెరిగాయి.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్, సమంత, ఎమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన 'తేరి' 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా తేరి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. విజయ్ స్టామినాతో పాటు దర్శకుడు అట్లీ సినిమాను రూపొందించిన విధానం, హీరోయిన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో తేరీ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అప్పట్లోనే సినిమాను రీమేక్ చేయాలని తెలుగు, హిందీ ఫిల్మ్ మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. గత ఏడాది తేరి సినిమా హిందీ వర్షన్ 'బేబీ జాన్' విడుదలైంది.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్ హీరోగా నటించగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. కీర్తి సురేష్‌కి ఇది మొదటి హిందీ సినిమా కావడంతో అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల అంచనాలు భారీగా పెరిగాయి. కానీ అంచనాలను బేబీ జాన్ అందుకోలేకపోయింది. బాలీవుడ్‌లో కీర్తి సురేష్ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాలీస్ దర్శకత్వం వహించిన బేబీ జాన్ సినిమాను హిందీ ప్రేక్షకులు తిరస్కరించారు. మినిమం వసూళ్లు కూడా రాలేదు. ఆ సమయంలో పుష్ప 2 సినిమా జోరు కంటిన్యూ కావడంతో బేబీ జాన్ నేల చూపులు చూసింది. దాంతో నిర్మాతకు భారీ నష్టాలు తప్పలేదు అంటూ జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి.
బేబీ జాన్ థియేట్రికల్ రిలీజ్‌లో డిజాస్టర్‌గా నిలిచినా ఓటీటీలో సినిమాను చూసేందుకు హిందీ ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఇన్ని రోజులు రెంటల్ పద్దతిలో స్ట్రీమింగ్ చేశారు. రూ.349 చెల్లించి బేబీ జాన్ చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సినిమాను ఫ్రీగా అందుబాటులో ఉంచారు. ఇన్ని రోజులు డబ్బులు చెల్లించాల్సి ఉండటంతో కొందరు చూడలేక పోయారు. ఇప్పుడు వారు బేబీ జాన్‌ను ఓటీటీ ద్వారా చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. డిజాస్టర్ మూవీని రూ.349లు పెట్టి ఏం చూస్తామని కొందరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు.
తేరి సినిమాలో హీరోయిన్‌గా నటించిన సమంతను రీమేక్‌లోనూ తీసుకోవాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆమె నటించలేదు. కానీ ఆమె సలహా మేరకు కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి వచ్చిన మొదటి సినిమా బేబీ జాన్. దాంతో ఆమెకు లక్ కలిసి వస్తుందని అంతా భావించారు. కానీ లక్ కలిసి రాలేదు. పెళ్లి తర్వాత ఆమె మొదటి ఫ్లాప్‌ను బేబీ జాన్‌తో తన ఖాతాలో వేసుకుంది. అయినా హిందీలో ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అక్క అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కీర్తి సురేష్ రెడీ అవుతోంది.