మిస్టర్ బచ్చన్ ట్రిమ్.. పర్ఫెక్ట్ రన్ టైమ్ కోసం..

ముఖ్యంగా మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది.

Update: 2024-08-16 14:36 GMT

మాస్ మహారాజ రవితేజ నటించిన "మిస్టర్ పర్చన్" సినిమా నిన్న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది.

దాదాపు అన్ని పాటలు కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి. అలాగే, సాంగ్ ప్రోమోతో పాటు టీజర్, ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మొదటి రోజే మాస్ ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. సినిమా ఫలితంపై కూడా మేకర్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఊహించిన విధంగా చిత్ర యూనిట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్, అలాగే నిర్మాత విశ్వ ప్రసాద్ చర్చించుకున్న తర్వాత సినిమాలో కొన్ని సన్నివేశాలను కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రవితేజ అమితాబ్ బచ్చన్ స్టైల్‌లో వచ్చే ఒక సీన్‌ను తొలగిస్తున్నారట. అంతేకాకుండా, హీరో మామ క్యారెక్టర్ మధ్యలో వచ్చే కొన్ని హిందీ డైలాగ్స్‌కు సంబంధించిన సీన్స్ కూడా ఎడిటింగ్‌లో తీసేస్తున్నట్లు తెలుస్తోంది.

దాదాపు పది నుంచి 12 నిమిషాల మధ్యలో కొన్ని సన్నివేశాలను తొలగిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలను తొలగిస్తే సినిమా మరింత అద్భుతంగా ఉంటుందని ముందుగానే ప్రేక్షకుల నుంచి కొంత కామెంట్స్ వినిపించాయి. మేకర్స్ కూడా ప్రేక్షకుల కోరిక మేరకు ఆలోచించి నిడివిని తగ్గించేందుకు సిద్ధమయ్యారు. ఫైనల్‌గా, సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మాస్ ఏరియాల్లోనే కాకుండా క్లాస్ ఏరియాల్లో కూడా సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి కూడా సపోర్ట్ అందుతోంది. భాగ్యశ్రీ, రవితేజ కెమిస్ట్రీ, వారి డాన్సులు కూడా ఈ సినిమాలో మరో మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. రవితేజ మాస్ అప్పీల్, కమెడియన్ సత్య క్యారెక్టర్ కూడా సినిమాలో మరో హైలైట్ పాయింట్‌గా నిలిచింది. ఆయన కామెడీ, అలాగే జగపతి బాబు యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో బాగానే పేలాయి. ఫైనల్‌గా, కొంత నిడివిని తగ్గించి సినిమాను మరింత పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News