స్టార్ హీరోలిద్దరు ఆ బ్యాడ్ సెంటిమెంట్ చేయరుగా!
పాన్ ఇండియాలో `కూలీ` ఓ సంచలనం అవుతుందని అంతా భావిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం పెద్ద ఎత్తున బిజినెస్..వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ టెన్షన్ పెట్టే అంశం ఒక్కటే. రజనీకాంత్-అమీర్ నటించడం కొత్తేం కాదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న `కూలీ` చిత్రంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లే. ఇప్పటికే సినిమాలో నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలు భాగమవ్వడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏకంగా మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ కూడా సీన్ లోకి రావడంతో ఆ అంచనాలు పీక్స్ చేరడం ఖాయం. రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇలా నాలుగు భాషల్లో ఫేమస్ అయిన నటులు ఉంటే సంచలనం కాక మరేం అవుతుంది.
అందులోనూ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే చిత్రమిది. ఒక్కో పాత్ర ఎలివేషన్ ఎలా ఉంటుందన్నది ఊహకి కూడా అందదు. లోకేష్ సక్సెస్ ట్రాక్ తోనే సినిమాకి భారీ హైప్ క్రియేట్ అవుతుంది. పాన్ ఇండియాలో `కూలీ` ఓ సంచలనం అవుతుందని అంతా భావిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం పెద్ద ఎత్తున బిజినెస్..వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ టెన్షన్ పెట్టే అంశం ఒక్కటే. రజనీకాంత్-అమీర్ నటించడం కొత్తేం కాదు.
మూడు దశాబ్ధాల క్రితం 1995లో `ఆటంక్ హీ ఆటంక్` లో చేశారు. ఈ చిత్రాన్ని దిలీప్ శంకర్ తెరకెక్కించారు. అప్పట్లోనే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. యావరేజ్ గా కూడా ఆడలేదు. అందులో నటించి తప్పు చేసానని ఓ సందర్భంలో అమీర్ సైతం భావించారు. ఆ తర్వాత మళ్లీ 2000లో సపోర్టింగ్ ఆర్టిస్టులతో కొంత భాగం రీ షూట్ చేసి కోలీవుడ్ లో `పొన్వన్నన్` గా అనువదించినా పనవ్వలేదు.
మళ్లీ 30 ఏళ్ల తర్వాత ఆ ద్వయం చేతులు కలిపింది. అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కానీ ఆ పాత సెంటిమెంట్ కూడా ఎక్కడో అందోళనకు గురి చేస్తుంది. దక్షిణాది స్టార్లతో కలిసి పనిచేయాలని ఉందని అమీర్ ఖాన్ చాలా సందర్భాల్లో అన్నారు. ఇప్పుడా అవకాశం `కూలీ` రూపంలో వచ్చింది. మరి ఈసారి ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సంచలనం నమోదు చేస్తారా? అన్నది చూడాలి.