బాడాస్ రవికుమార్ రంపంతో కోస్తాడు

అత‌డు బాలీవుడ్ లో హీరోగాను ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-13 04:39 GMT

ద‌లేర్ మెహందీ త‌ర్వాత పంజాబీ పాప్ గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు హిమేష్ రేష‌మ్మియాకు గొప్ప పాపులారిటీ ఉంది. అత‌డు బాలీవుడ్ లో హీరోగాను ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. హిమేష్ కి గొప్ప ఫాలోవ‌ర్స్ ఉన్నారు. న‌టుడిగా, గాయ‌కుడిగా స‌క్సెసైన అరుదైన ప‌ర్స‌నాలిటీ. హిమేశ్ రేషమ్మియా పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగులో దశావతారం చిత్రానికి స్వ‌రాల్ని స‌మ‌కూర్చాడు. ఎక్కువగా సల్మాన్ ఖాన్ చిత్రాలకు పనిచేస్తుంటాడు.

అయితే అతడు ఇటీవ‌లి కాలంలో స్త‌బ్ధుగా ఉన్నాడు. ఇప్పుడు అత‌డు నటించిన 'బ్యాడ్‌యాస్ రవికుమార్' చిత్రం సోష‌ల్ మీడియాల్లో హాట్ టాపిగ్ గా మారుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుద‌లై ఇప్ప‌టికే జోరుగా వైర‌ల్ అయింది. తక్కువ వ్యవధిలో రికార్డు స్థాయిలో వీక్షణలు అందుకుంది. ట్రైలర్‌లో డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. హిమేష్ తో పాటు ఈ చిత్రంలో ప్ర‌భుదేవా పెర్ఫామెన్స్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. త్వ‌ర‌లోనే ఇది థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఈ సంవత్సరం ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌ తాజా జాబితాలో బాడాస్ రవికుమార్ మొదటి స్థానంలో నిలిచింది. 24.2శాతం మంది ఈ సినిమాని వీక్షించేందుకు ఆసక్తి చూప‌గా, గేమ్ ఛేంజర్ , క్రిష్ 4 వంటి చిత్రాలను అధిగమించింది. ఈ జాబితాలో క్రిష్ 4 దిగువ‌న‌ ఉంది. కేవలం 3.4 శాతం మంది మాత్రమే ఈ మూవీపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. చివరి స్థానంలో మాధ గజ రాజా నిలిచింది. ఆజాద్, ఫతే, డాకు మహారాజ్, దేవా , స్కై ఫోర్స్ చిత్రాల ట్రైల‌ర్ల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కింది.

తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. బాడాస్ రవికుమార్ సినిమాకి సానుకూల స్పందనలు వ‌స్తున్నాయి. ఈ సినిమాకి తెలుగులో డీజే టిల్లుకు వ‌చ్చినంత మంచి స్పంద‌న వ‌చ్చింది. అందువ‌ల్ల ఓపెనింగుల‌తోనే ఇది సేఫ్ జోన్ కి చేరుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కేవ‌లం 20 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా పెట్టుబ‌డిని సులువుగా రిక‌వ‌రీ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News