నీల్ కథ ఢమాల్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన తెరకెక్కించిన సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తుంటారు. కచ్చితంగా హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోతుంటారు. అలాంటి క్రేజీ డైరెక్టర్ సినిమాకు కథ అందించారంటే.. భారీ హైప్ క్రియేట్ అవ్వడం కామన్. ఇప్పుడు బఘీరా విషయంలో అదే జరిగింది. కన్నడ హీరో శ్రీమురళి నటించిన పాన్ ఇండియా మూవీ బఘీరాకి ప్రశాంత్ నీల్ కథను అందించారు.
సూపర్ హీరో యాక్షన్ ఎంటర్టైనర్ గా డాక్టర్ సూరి తెరకెక్కించగా.. ప్రముఖ హోంబాలే ఫిల్మ్స్ సంస్ధ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రశాంత్ నీల్ కథ అందించడంతోనే ఎక్కువ బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన బఘీరా.. కనీస రెస్పాన్స్ కూడా అందుకోలేకపోయంది. అసలు సినిమా కథేంటి? ప్రశాంత్ నీల్ కథ ఇచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకుపోవడానికి కారణాలేంటి? ఓ సారి తెలుసుకుందాం.
స్టోరీ లైన్ ఇదే.. బఘీరాలో హీరోకు సూపర్ హీరోలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కావడంతో తాను కూడా అలా మారాలని అనుకుంటాడు. ఆ తర్వాత తల్లి చెప్పిన మాటలు విని పోలీస్ అవుతాడు. క్రిమినల్ ముఠాలను అంతం చేస్తాడు. ఆ తర్వాత తన జాబ్ కోసం తండ్రి లంచం ఇచ్చాడని తెలిసి బాధపడతాడు. అప్పుడే కొత్త నిర్ణయం తీసుకుంటాడు. పగలు పోలీస్ గా.. నైట్ సూపర్ హీరో బఘీరగా క్రిమినల్స్ ను చంపుతాడు. అయితే గరుడ్ రామ్ గురించి తెలుసుకుని అతడి ఆట కట్టాలని చూస్తాడు.
ఇక బఘీరాకు ఏం తెలిసింది? ఏం చేశాడు? లవ్ స్టోరీ సక్సెస్ అయిందా? వంటి ప్రశ్నలకు సమాధానాలే సినిమా. అయితే స్టోరీ లైన్ అస్సలు కొత్త అనిపించలేదని చెప్పవచ్చు. సినిమా అంతా రొటీన్ వ్యవహారంగానే అనిపిస్తోంది. ఇప్పటి వరకు నీల్ తీసిన కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలు రెగ్యులర్ యాక్షన్ స్టోరీస్ అయినా.. ఎలివేషన్లు ఇచ్చిన విధానం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. బఘీరా కూడా అలాంటి స్టోరీనే. రొటీన్ కథ అయినా తెరకెక్కించే విధానంలో లోపం కనిపిస్తుంది.
ముఖ్యంగా డైరెక్టర్ సూరి స్క్రీన్ ప్లే తో పాటు సినిమా తీసే తీరు సాగదీతగా అనిపిస్తోంది. కథలో రుక్మిణి పాత్రకు ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. రెండు పాటలతోపాటు కొన్ని సీన్స్ కు పరిమితం చేశారు. విలన్ రోల్ ఓకే అనిపించినా లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ గా చూపించలేకపోయారు. శ్రీమురళి మాత్రం తనవరకు న్యాయం చేశారు. చివరకు రొటీన్ రాతకు రోటీన్ తీత తోడవ్వడంతో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించినా బఘీరా మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మారిపోయింది.