ఆ కన్నడ హీరో నెల్లూరు అల్లుడా?
కన్నడ నటుడు శ్రీమురళి తెలుగు ఆడియన్స్ కి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాడు.
కన్నడ నటుడు శ్రీమురళి తెలుగు ఆడియన్స్ కి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ `ఉగ్రం` సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. అదే సినిమాతో ప్రశాంత్ నీల్ కి మంచి పేరొచ్చింది. ఆ మేకింగ్ సరళితోనే కేజీఎఫ్ తో తానో బ్రాండ్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే ఉగ్రం తర్వాత శ్రీ మురళి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. యాక్షన్ స్టార్ గా మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం `బఘీర` అనే సినిమా చేస్తున్నాడు.
దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు కూడా ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. ఇది మదర్ సెంటిమెంట్ స్టోరీలా హైలైట్ అవుతుంది. తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రచారం కోసం హైదరాబాద్ లో హల్చల్ చేస్తున్నాడు. ఈ సందర్బంగా శ్రీమురళి తెలుగింట అల్లుడు అన్న సంగతి బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు.
వాళ్ల అత్తగారిది ఏపీలోని నెల్లూరు అట. ఇంట్లో అంతా తెలుగు మాట్లాడుతారుట. తన భార్య, అత్తగారు తెలుగులోనే మాట్లాడుకుంటారుట. దీంతో మురళీ కూడా తెలుగు మాట్లాడటం ఇంట్లో అలవాటుగా మారిందన్నాడు. కెరీర్ పరంగా ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునట్లు గుర్తు చేసాడు. తప్పుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు తెలిపాడు. అలాగే ఉగ్రం తర్వాత నటించిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయన్నాడు.
`ఉగ్రం` తన కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలించిందన్నాడు. బఘీర రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులకు తాను చెప్పాల్సింది చెప్పాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కు రండ అని, తనని కొత్త నటుడిగా చూసి ప్రేక్ష కులంతా ఆశీర్వదించాలని కోరాడు. తెలుగు ఆడియన్స్ నుంచి ప్రేమ దొరికితే చాలు అన్నాడు. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేకుండా తెలుగు ఆడియన్స్ సినిమాకొస్తారు. అది ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. మరి శ్రీ మురళి ఎలాంటి కంటెంట్ తో వస్తున్నాడో చూడాలి.