HYDలో బహుముఖం.. వీపుకు స్క్రీన్ తో తిరుగుతూ!

అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో బహుముఖం మేకర్స్ పోస్ట్ చేశారు. మా జర్నీ జస్ట్ బిగినింగ్ అంటూ ట్వీట్ చేశారు.

Update: 2024-03-08 07:37 GMT

మేడిన్ యూఎస్ ఏ... అసెంబుల్డ్ ఇన్ ఇండియా... 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా అంటూ బహుముఖం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు టాలెంటెడ్ ఆర్టిస్ట్ హర్షివ్ కార్తీక్. గుడ్, బ్యాడ్ & యాక్టర్.. అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. హీరోగా నటించడమే కాకుండా రచన, దర్శక నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు హర్షివ్ కార్తీక్. గ్యారీ బీహెచ్‌తో కలిసి ఎడిటింగ్ కూడా చేశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక టీజర్.. ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి బహుముఖం అని టైటిల్ పెర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. హీరో హర్షివ్ కార్తీక్ మల్టీపుల్ షేడ్స్ లో అదరగొట్టారు. రచన, దర్శకత్వంతో సహా ఇతర విభాగాలను కూడా చక్కగా నిర్వహించారని సినీ పండితులు చెబుతున్నారు.

తాజాగా మేకర్స్.. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. హీరో హర్షివ్ కార్తీక్ హైదరాబాద్ లో సందడి చేశారు. వీపుకు ఎల్ ఈడీ స్క్రీన్ ను అమర్చుకుని టీజర్ ను ప్లే చేసి సిటీలోని ప్రముఖ ప్రదేశాలలో పర్యటించారు. సినీ లవర్స్ తో ముచ్చటించి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అమీర్ పేట్, దుర్గం చెరువు, నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, పంజా గుట్ట, గచ్చిబౌలి, డీఎల్ ఎఫ్, కేపీహెచ్ బీ తదితర ప్రాంతాలకు వెళ్లారు హర్షివ్.

అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో బహుముఖం మేకర్స్ పోస్ట్ చేశారు. మా జర్నీ జస్ట్ బిగినింగ్ అంటూ ట్వీట్ చేశారు. హర్షివ్ నయా ప్రమోషన్ కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, యుఎస్ఏ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు మేకర్స్.

క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అరవింద్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామస్వామి డైలాగ్స్ అందిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. రామ్ మనోహర్ రెండు పాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News