అఖండ2 బాలయ్య క్యారెక్టర్ పై బిగ్ అప్డేట్
బోయపాటి శ్రీను ఈ సినిమాను మొదటి పార్ట్ ను మించి ఎంతో పవర్‌ఫుల్ లో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.;

బాలయ్య కెరీర్ కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్నంత పూర్తిగా మారింది. కరోనాకు ముందు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన బాలయ్య, కరోనా తర్వాత వచ్చిన అఖండ సినిమాతో విజయాల బాట పట్టారు. బాలయ్య ఏ ముహూర్తాన అఖండ మొదలుపెట్టారో తెలీదు కానీ అప్పట్నుంచి తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.
అఖండ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న బాలయ్య ఆయా సినిమాలతో వరుసగా నాలుగుసార్లు రూ.100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సీనియర్ హీరోగా నిలిచారు. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాకు కొనసాగింపుగా అఖండ2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
బోయపాటి శ్రీను ఈ సినిమాను మొదటి పార్ట్ ను మించి ఎంతో పవర్‌ఫుల్ లో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. అఖండ2 లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాలయ్య ఒక పాత్రలో నార్మల్ లుక్ లో కనిపించనుండగా, మరో పాత్రలో బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే అఖండ2పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. అఖండ2 ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య రెగ్యులర్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని, అఖండతో పోలిస్తే అఖండ2లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అఖండ2లో శివ తత్వం, ఆలయాల పరిరక్షణ, ఫ్యామిలీ ఎమోషన్ వంటి అంశాలతో పాటూ ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా బోయపాటి జోడించినట్టు తెలుస్తోంది.
ఆల్రెడీ బోయపాటి- బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. అఖండ2 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.