బాలకృష్ణకు ఇష్టమైన హీరోయిన్లు ఎవరంటే..
ఒకప్పుడు తమ యాక్టింగ్ తో మెప్పించి లేడీ బాస్ అనిపించుకున్న విజయశాంతి, రమ్య కృష్ణ, సిమ్రన్ అంటే తనకు ఇష్టమని బాలయ్య ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
నార్మల్ ఆడియన్స్‌కే కాదు, హీరోహీరోయిన్లకు కూడా ఫేవరెట్ నటులు, నటీమణులు ఉంటారు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు వేలాది మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అలాంటి బాలయ్యకు ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరనే ప్రశ్న రీసెంట్ గా ఆయనకు ఎదురైంది. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నారా భువనేశ్వరి ఇచ్చిన పార్టీలో భువనేశ్వరి బాలయ్యను ఈ ప్రశ్న అడిగింది.
మీ కెరీర్లో మీకు ఇష్టమైన ముగ్గురు హీరోయిన్లు ఎవరని అడగ్గా, దానికి బాలయ్య ముగ్గురు క్రేజీ హీరోయిన్ల పేర్లు చెప్పారు. అయితే బాలయ్య చెప్పిన వారు ఈ తరం హీరోయిన్లు కాదు. ఒకప్పుడు తమ యాక్టింగ్ తో మెప్పించి లేడీ బాస్ అనిపించుకున్న విజయశాంతి, రమ్య కృష్ణ, సిమ్రన్ అంటే తనకు ఇష్టమని బాలయ్య ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
అయితే బాలయ్య ఆ ముగ్గురు హీరోయిన్లతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. విజయశాంతితో కలిసి రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, మువ్వా గోపాలుడ, ముద్దుల మావయ్య లాంటి సినిమాలు చేసిన బాలయ్య, ఆమెతో కలిసి ఏకంగా 17 సినిమాల వరకు చేశాడు. రమ్యకృష్ణతో దేవుడు, బంగారు బుల్లోడు, వంశానికి ఒక్కడు సినిమాలు చేశాడు.
సిమ్రన్ తో కలిసి కూడా బాలయ్య తన కెరీర్ లో బెస్ట్ సినిమాలు చేశాడు. ముఖ్యంగా సిమ్రన్ తో కలిసి సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు సినిమాల్లో బాలయ్య నటించాడు. ఆ తరం హీరోయిన్లలో వారి పేర్లు చెప్పిన బాలయ్యకు ప్రెజెంట్ జెనరేషన్ లో రష్మిక మందన్నా అంటే చాలా ఇష్టమని ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపాడు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న బాలయ్య, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న అఖండ2 రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.