మోహన్ లాల్, శివన్న, బాలయ్య ఒకేసారి బరిలోకా!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` శర వేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` శర వేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్ సహా కీలక పాత్రధారులంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం కేరళలో కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నార. ఇందులో రజినీ కాంత్, రమ్యకృష్ణ సహా ఫ్యామిలీ మెంబర్లు అంతా పాల్గొన్నారు.
అయితే ఇంకా గెస్ట్ రోల్స్ ఎంటర్ కాలేదు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ జైలర్ లో పవర్ పుల్ పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. కనిపించింది కాసేపే అయినా థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో రెండవ భాగంలో వాళ్లతో పాటు టాలీవుడ్ నుంచి నటసింహ బాలకృష్ణ కూడా రంగంలోకి దిగుతున్నట్లు కొన్ని రోజులుగా వినిపిస్తున్నదే. బాలయ్య ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంచనాలు భారీగా ఉన్నాయి.
బాలయ్యకు హిందీ మార్కెట్ లో కూడా ఇమేజ్ ఏర్పడటంతో సినిమాకు మరింత కలిసొస్తుంది. అయితే ఈ నయా స్టార్లు ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. అడుగు పెడితే విధ్వంసమే. దీనిలో భాగంగా సమ్మర్ తర్వాత ఈ ముగ్గురు స్టార్లపై సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని సమాచారం. `జైలర్ 2` కథ జైలర్ మొదటి భాగం ఎక్కడ ముగించారో ? అక్కడ నుంచే మొదలవుతుంది. అదే కథకు కంటున్యూటీగా అదనంగా కొన్ని కొత్త పాత్రలు యాడ్ అవుతాయి.
పాత్రల పేర్లు కూడా ఏమీ మారవని సమాచారం. సినిమాలో ఆ పేర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటా యి. ఈనేపథ్యంలో బాలయ్య పాత్రకు ఎలాంటి పేరు పెడతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా `అఖండ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమా షూటింగ్ లోనే బాలయ్య బిజీగా ఉన్నారు.