అఖండ2 కోసం బాలయ్య అంత తీసుకుంటున్నాడా?
ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తాండవం చేస్తున్న విషయం తెలిసిందే.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలందుకున్న బాలయ్య రీసెంట్ గా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. వరుస హిట్స్ లో ఉన్న బాలయ్య ను చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషపడుతున్నారు.
ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. అసలే బాలయ్య- బోయపాటి అంటే సూపర్‌హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలియికలో ఇప్పటికే పలు సినిమాలొచ్చాయి.
సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య- బోయపాటి ఇప్పుడు అఖండ2 కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అఖండ2 స్క్రిప్ట్ ను బోయపాటి నెక్ట్స్ లెవెల్ లో రాసుకున్నాడని, సినిమాలో గూస్‌బంప్స్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని యూనిట్ సభ్యులంటున్నారు.
ఇక అసలు విషయానకొస్తే, బాలయ్య అఖండ2 కు తన రెమ్యూనరేషన్ ను ఒక్కసారిగా పెంచినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు రూ.28 కోట్లు ఛార్జ్ చేసిన బాలయ్య ఏకంగా ఏడు కోట్లు పెంచి రూ.35 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. బాలయ్య మార్కెట్, హిట్ ట్రాక్ చూసి నిర్మాతలు కూడా బాలయ్య అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.
అయితే రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలకృష్ణ ఓ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. గత నాలుగు సినిమాలుగా తమన్- బాలయ్య కలిసి సినిమాలు చేస్తున్నారు. తమన్ పనితనం నచ్చడంతో బాలయ్య దానికి కృతజ్ఞతగా ఈ కారును గిఫ్ట్ ఇచ్చాడు. అయితే తమన్ కు బాలయ్య ఆ కారు కొనింది కూడా అఖండ2 రెమ్యూనరేషన్ లో నుంచే అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.