జైలర్ 2లో బాలయ్య?.. శివన్న క్లారిటీ ఇచ్చారుగా!
అయితే జైలర్ సీక్వెల్ లో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.;

జైలర్.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఫామ్ లోకి వచ్చారు తలైవా. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. అయితే జైలర్ కు సీక్వెల్ ఉందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వర్క్స్ జరుగుతున్నాయి.
అయితే జైలర్ సీక్వెల్ లో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన రోల్ పవర్ ఫుల్ గా ఉండనుందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ విషయంపై కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడారు. తన అప్ కమింగ్ మూవీ 45 ప్రెస్ మీట్ లో రెస్పాండ్ అయ్యారు.
"జైలర్ 2లో మీరు బాలకృష్ణతో కలిసి నటిస్తున్నారట కదా?" అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు శివరాజ్ కుమార్ సమాధానమిచ్చారు. అవునా.. నాకు తెలియదని అన్నారు. సినిమాలో తన పాత్ర ఉందని దర్శకుడు నెల్సన్ చెప్పారని తెలిపారు. బాలయ్య కూడా మూవీలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిలో తాను యాక్ట్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. కానీ తమ కాంబినేషన్ లో సీన్స్ లేవని అన్నారు. పర్సనల్ గా తాను, బాలయ్య మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. చాలా క్లోజ్ గా, కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉంటామని తెలిపారు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
అయితే జైలర్-2లో బాలయ్య ఉండే బాగుంటుందని శివరాజ్ చెప్పినా.. నటిస్తున్నారో లేదో మాత్రం చెప్పలేదు. మొత్తానికి బాలయ్య సీక్వెల్ లో భాగమయ్యారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం నటసింహం.. అఖండ-2 మూవీతో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఆ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో శివరాజ్ కుమార్.. ఇప్పుడు 45 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తన రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని అన్నారు. జైలర్ 2లో కూడా భాగం కానున్నారు.