బాలయ్యతో ఆ డైరెక్టర్ ఇప్పట్లో లేనట్టే..!

త్వరలోనే ఆ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

Update: 2025-03-02 03:15 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దసరా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 కాగానే మరోసారి వీర సింహా రెడ్డి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. ఈసారి డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణకు అదిరిపోయే కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది. కథ విని బాలయ్య ఫుల్ గా ఎగ్జైట్ అయ్యారట. త్వరలోనే ఆ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

ఐతే బాలయ్య డైరెక్టర్స్ లిస్ట్ లో కె ఎస్ బాబీ కూడా ఉన్నాడు. ఆల్రెడీ ఆయనతో డాకు మహారాజ్ సినిమా చేసిన బాబీ మళ్లీ ఆయనతో సినిమాకు రెడీ అనేస్తున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ కూడా సినిమా చేస్తాడన్న టాక్ ఈమధ్య వచ్చింది. బాలయ్యతో పూరీ పైసా వసూల్ అంటూ ఒక సినిమా చేశారు. ఆ మూవీ నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందించింది.

బాలయ్యలోని మాస్ ని మరో యాంగిల్ లో చూపించిన పూరీ పైసా వసూల్ టైం లోనే బాలయ్యతో మరో సినిమా చేయాలని అనుకున్నారట. ఐతే అది అప్పుడు కుదరలేదు. ఇప్పుడు పూరీ అసలు ఫాం లో లేడు. తన సినిమా అంటే హీరోలు ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ టైం లో మరోసారి బాలయ్య దగ్గరకే వెళ్లి సినిమా చేసే అవకాశాన్ని అడుగుతున్నాడట పూరీ జగన్నాథ్. డైరెక్టర్స్ పై బాలకృష్ణకు అపారమైన గౌరవం ఉంటుంది.

ఐతే ఆల్రెడీ సూపర్ హిట్ ఫాం లో ఉన్న బాలయ్య పూరీ తో సినిమా చేసే ఛాన్స్ అసలు లేదు. ఆల్రెడీ ఆయనతో సినిమా చేసే డైరెక్టర్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది కాబట్టి కచ్చితంగా ఆ ఛాన్స్ లేనట్టే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీ అయ్యాడు.

లాస్ట్ ఇయర్ రామ్ తో తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా విఫలమవ్వడంతో ఇక చేసేదేమి లేక సైలెంట్ అయిపోయాడు. ఐతే ఈమధ్య పూరీ రణ్ బీర్ తో సినిమా చేస్తాడని కథ రెడీ చేశాడన్న వార్తలు వచ్చాయి. యానిమల్ హీరో అసలు పూరీతో సినిమా ఎలా ఒప్పుకుంటాడంటూ ముమంబై మీడియా కథనాలు రాసింది. ఐతే సరైన కథ తో వస్తే పూరీ మళ్లీ ఏ హీరోతో అయినా సూపర్ హిట్ కొట్టగలడు. ఐతే ఆ సినిమా ఎప్పుడు ఎవరితో అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

Tags:    

Similar News