మీనాక్షి విష్ లిస్ట్ లో ఆ హీరో కూడా!
ఇక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఈ ఇయర్ తనకు ఎంతో మంచి ఆరంభాన్ని ఇచ్చిందని, మిగిలిన ఈ సంవత్సరం కూడా అలానే కంటిన్యూ అవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.;

హైదరాబాద్‌లో కెపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెం.1 లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ మీనాక్షి చౌదరి హాజరయ్యారు. వారిని చూడటానికి అక్కడికి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆ ఏరియా మొత్తం కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. షాప్ ఓపెనింగ్ తర్వాత బాలయ్య, మీనాక్షి మీడియాతో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, తన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందని, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అని అలానే ఇక్కడ ఉన్న ఏ చీర మీనాక్షి వేసుకున్నా ఆ చీరకే అందమొస్తుందని, తాను ఏం చేసినా ప్రత్యేకంగా ఉన్నట్టే, మీనాక్షి కూడా ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుందని, ఆమె పాత్రలు కూడా అలానే ఉంటాయని, ఓ హిందీ కవిత చెప్పి మీనాక్షిని ఆశ్చర్యపరిచారు బాలయ్య.
తెలుగు సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉందని, ఇప్పటివరకు తాను ఎన్నో జానర్లలో సినిమాలు చేశానని అందులో ఆదిత్య 369, భైరవద్వీపంతో పాటూ మరెన్నో నేపథ్యాల్లో సినిమాలు చేశానని, ఎవరైనా మా నందమూరి వాళ్లని అనుసరించాల్సిందేనని, సినిమాల్లో ట్రెండ్ సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే అని బాలకృష్ణ అన్నారు.
ఇక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఈ ఇయర్ తనకు ఎంతో మంచి ఆరంభాన్ని ఇచ్చిందని, మిగిలిన ఈ సంవత్సరం కూడా అలానే కంటిన్యూ అవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. బాలయ్య బాబుతో సినిమా చేయరా అని అడిగిన ప్రశ్నకు కూడా మీనాక్షి ఈ సందర్భంగా సమాధానమిచ్చింది. బాలయ్య సర్ తో కూడా సినిమా చేయాలనుందని, సరైన స్క్రిప్ట్, కరెక్ట్ టైమ్ కు వస్తే సినిమా చేస్తానని, తాను సినిమాలు చేయాలనుకుంటున్న హీరోల విష్ లిస్ట్ లో బాలయ్య సర్ పేరు కూడా ఉందని మీనాక్షి వెల్లడించింది.