మెగా-అల్లు వివాదం గురించి బాలయ్య ఏమన్నారంటే?
ఏపీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు వచ్చాయంటూ కొన్ని నెలలుగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే
ఏపీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు వచ్చాయంటూ కొన్ని నెలలుగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైకాపా అభ్యర్దికి మద్దతివ్వడంతోనే ఇదంతా మొదలైంది. అటుపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ పాత్రల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమవ్వడంతో ఈసారి సీన్ లోకి ఏకంగా నేరుగా అల్లు అర్జున్ మామగారు తెరపైకి వచ్చి పవన్ ని హెచ్చరించారు.
తన వ్యాఖల్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే? చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా నటసింహ బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ యూ ట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వూలో ఆ రెండు ఫ్యామిలీల రిలేషన్ షిప్ గురించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు. మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్- అల్లు అరవింద్ తనయుడు అర్జున్ చాలా సరదాగా ఉంటారన్నారు.
ఇటీవలే `పుష్ప-2` షూటింగ్ సెట్స్ కి వెళ్లాను. అక్కడ బన్నీ, దర్శకుడు సుకుమార్ తో చాలాసేపు మాట్టాడానన్నారు. అలాగే అల్లు అరవింద్‌గారి కోసమే అన్‌స్టాప్‌బుల్ షోని హోస్ట్ చేస్తున్నాన్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, కాకపోతే బిజీ షెడ్యూల్ కారణంగా తరుచూ కలుసుకోవడం వీలుపడలేదున్నారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉంటామని, అందుకే బయట పెద్దగా కలవనని తెలిపారు.
కానీ ఏదైనా సినిమా ఈవెంట్స్‌లో కలిసినప్పుడు మాత్రం అంతా సరదాగా ఉంటామన్నారు. బాలయ్య వ్యాఖ్యలు మెగా-అల్లు అభిమానులకు కాస్త ఊరటనివచ్చేవే. ఇటీవలే ఆ రెండు ఫ్యామిలీల గురించి నెట్టింట ఎలాంటి ప్రచారం జరుగుతోందో తెలిసిందే. మెగా-అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఏ కంగా అసభ్య పదజాలంతో తిట్టుకునే పరిస్థితే తలెత్తింది.