బాలయ్య లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా!
నటసింహ బాలకృష్ణ అంటే? వెండి తెరపై భారీ యాక్షన్ సన్నివేశాలు, తొడలు కొట్టడం, డైలాగులు, పద్యాలు చెప్పడం మాత్రమే కాదు.
నటసింహ బాలకృష్ణ అంటే? వెండి తెరపై భారీ యాక్షన్ సన్నివేశాలు, తొడలు కొట్టడం, డైలాగులు, పద్యాలు చెప్పడం మాత్రమే కాదు. అంతకు మించి గొప్ప హోస్ట్ అని `అన్ స్టాపబుల్` తో ప్రూవ్ అయింది. సెలబ్రిటీలను తన మాటలతో ఇరకాటంలో పెట్టడంలోనూ మహా ఘనా పాటి అని చాటి చెప్పారు. తాజాగా డ్రమ్స్ కూడా వాయించి తనలో ఈ ట్యాలెంట్ కూడా ఉందని నిరూపించారు.
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ కన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. `యుఫోరియా` పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మ్యూజికల్ నైట్ షో జరిగింది. అతిరధ మహారధుల సమక్షంలో బాలయ్య డ్రమ్స్ వాయించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి డ్రమ్స్ వాయించడం ఒక ప్రత్యేక అయితే బాలయ్య తోడవ్వడం మరో ఆకర్షణగానూ మారింది.
శివమణితో బాలయ్య జత కట్టడంతో వేడుక మరింత గొప్పగా సాగింది. ప్రొఫెషనల్ వాయిద్యకారుడిలా బాలయ్య డ్రమ్స్ ప్లే చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య ను అలా చూసి అభిమానులే స్టన్ అయిపోతున్నారు. ఏంటి నా అభిమాన హీరోలో ఈ ట్యాలెంట్ కూడా ఉందని షాక్ అవుతున్నారు. దీంతో నెట్టింట బాలయ్య ట్యాలెంట్ ను ఉద్దేశించి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఓ అభిమాని అయితే శివమణినే మించిపోయేలా ఉన్నాడు? అంటూ పోస్ట్ పెట్టాడు. బాలయ్య ఏ వేదికపై కనిపించినా అక్కడో కళ తోడవుతుంది. ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. ఇలా మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొంటే ఆ కిక్ వేరే లెవల్లోనూ ఉంటుందని నిన్నటితో ప్రూవ్ అయింది. ఇటీవలే బాలయ్య `డాకు మహారాజ్` తో మరో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.