ప్రగ్యాకి ఈసారైనా పని అవుద్దా?

ముంబై బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో తన అందం, అభినయంతో స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు.

Update: 2024-10-16 12:30 GMT

ముంబై బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో తన అందం, అభినయంతో స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. కోలీవుడ్ మూవీ విరట్టుతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడు.. అదే ఏడాది టిటూ ఎంబీఏ చిత్రంతో బీటౌన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగు మూవీ లవర్స్ కు హీరోయిన్ గా పరిచయమయ్యారు. 2015లో వచ్చిన కంచె మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఆ సినిమాలో తన యాక్టింగ్ ను విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు ప్రగ్యా. అనేక అవార్డులు కైవసం చేసుకున్నారు. టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. కంచె తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నారు. కానీ సరైన హిట్ అందుకోలేకపోయారు. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి వివిధ చిత్రాల్లో నటించినప్పటికీ.. ప్రగ్యా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయారు.

ఇక 2021లో నందమూరి బాలకృష్ణతో చేసిన అఖండ సినిమా.. ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌కు మరోసారి బూస్ట్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఆ మూవీతో మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆమెకు అవకాశాలు ఫుల్ గా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సన్నాఫ్ ఇండియా వంటి సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఆమెకు ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె NBK 109, బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు చిత్రాల్లో నటిస్తున్నారు!

అదే సమయంలో ప్రగ్యా.. రీసెంట్ గా క్రేజీ ఆఫర్ అందుకున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో రానున్న నాలుగో చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఆ సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరగ్గా.. ఆమె పాల్గొన్నారు. ముహుర్తపు షాట్ లో బాలయ్యతో కనిపించారు. దీంతో అఖండ-2లో ఆమెనే హీరోయిన్ గా తెలుస్తోంది. ప్రస్తుతం అఖండ-2 తాండవం మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.

దీంతో ప్రగ్యా జైస్వాల్ మంచి ఆఫర్ అందుకున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే బోయపాటి.. పలు సందర్భాల్లో అఖండ-2 అద్భుతంగా ఉంటుందని అంచనాలు పెంచారు. దీంతో ప్రగ్యా.. అఖండ-2తో మరో హిట్ అందుకుంటారని అభిప్రాయపడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న ఆమెకు ఊరట లభిస్తుందని అంటున్నారు. మరి అఖండ సీక్వెల్ తో ప్రగ్యా ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News